Home రాజకీయాలు విజయవాడలో టీడీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ కలకలం

విజయవాడలో టీడీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ కలకలం

1073
SHARE

అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. టీడీపీ తీరుకు నిరసనగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రికి ప్రత్యక్షమైన ఈ హోర్డింగ్‌లతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటుపై అధికార పార్టీ నేతలకు సమాచారం అందడం.. అనంతరం మున్సిపల్‌ సిబ్బందితో వాటిని తొలగించడం చకాచకా జరిగిపోయాయి.

ఫ్లెక్సీలో ఏముందంటే..?
ప్రజలారా ఆలోచించడంటూ.. ‘కేంద్రం ఇచ్చిన స్పెషల్‌ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూ టర్న్‌ తీసుకొని మళ్లీ హోదానే కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే!.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా?.. తెలుగు దేశం తమ్మూళ్లూ.. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరదామా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు కరెక్టు!.. కాల్‌ మనీ కేసుల విచారణ ఏమైంది..? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి తెలుగుదేశం తమ్మూళ్లూ! కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా తెలుగు దేశం తమ్మూళ్లూ?’ అని 5 కోట్ల మంది ఆంధ్రులు అని భారీ  ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. కానీ ఈ బీజేపీ శ్రేణులే ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది.