Home రాజకీయాలు త్వరలో కార్పోరేషన్ ఛైర్మన్ గా ఆశోక్ బాబు

త్వరలో కార్పోరేషన్ ఛైర్మన్ గా ఆశోక్ బాబు

163
SHARE

తెలుగుదేశం పార్టీ తరుపున మరో ఉద్యోగ సంఘం నాయకుడు రంగం మీదకు రాబోతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యోగ ప్రతినిధులు వివిధ పార్టీలలో చేరిన సంగతి తెలిసిందే. ఎపి ఎన్జీవో నేత త్వరలో టిడిపిలో చేరబోతున్న విషయం తెలిసిందే.. తన ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేసిన వెంటనే ఓ కీలక కార్పోరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారని అమరావతిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆశోక్ బాబు ఏకపక్షంగా ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వానికి ధారాధత్తం చేశారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా అతని వల్ల పనిచేసే శాఖలో దాదాపు 650మంది సహచరుల ప్రమోషన్లు ఆగిపోయాయని ఆరోపిస్తున్నారు.

అశోక్‌బాబు రాజకీయ ప్రవేశం ఖాయం కావడంతో.. మొత్తంగా అశోక్ బాబు ఉద్యోగ పర్వం ఎలా ఉన్నప్పటికీ పోొలిటికల్ లైఫ్ మాత్రం ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.