Home రాజకీయాలు రాహుల్ గాంధీ ని టార్గెట్ చేసిన జేసీ!

రాహుల్ గాంధీ ని టార్గెట్ చేసిన జేసీ!

SHARE

వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యంగ్యాస్త్రాలు సంచలనాత్మక ప్రకటనలతో తరచు వార్తల్లో నిలిచే అనంతపూర్ తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తనదైన ధోరణిలో విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని వివాదానికి తేరా తీశారు.

సోనియా కు రాహుల్ గురించి ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణ యువతితో రాహుల్ గాంధీ కి వివాహం జరిపిస్తే.. రాహుల్అ తప్పకుండా ప్రధానమంత్రి అవుతాడు’ అంటూ జేసీ వ్యాఖ్యానించారు.

లోక్ సభ ఎన్నికల్లో యూపీ రాష్ట్రం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఆ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు లభించిన వారికే ఖచ్చితంగా ప్రధాని పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని, దానివల్ల ఆ రాష్ట్రానికి చెందిన ఓ బ్రాహ్మణ యువతితో రాహుల్ గాంధీ కి పెళ్లి చేయించాలని సలహా పారేశారు మన జేసీ.

అయితే ఏపీ ప్రజలు, మరీ ముఖ్యంగా అనంతపూర్ ప్రజలు జెసీ ఎం చేసినా ఈ సారి ఎంపీ గా గెలిచేది లేదని అంతం కొసమెరుపు!!