Home ప్రత్యేకం మన దేశం ఎన్టీఆర్ గెట్ అప్ లో బాలయ్య కేక!!

మన దేశం ఎన్టీఆర్ గెట్ అప్ లో బాలయ్య కేక!!

SHARE

విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు పై తీస్తున్నబయోపిక్ షూటింగ్ ఈ శుభ దినాన ప్రారంభమైంది. ఎన్టీఆర్ మొట్టమొదటి సారి హీరోగా పరిచయమైన ‘మనదేశం’ సినిమా మూవీ లుక్‌లోనే క్రిష్ షూటింగ్ ప్రారంభించటం విశేషం.

ఎన్టీఆర్‌ను తలపిస్తోన్న బాలయ్య ఫొటోను డైరెక్టర్ క్రిష్ షేర్ చేశాడు. నాడు, నేడు ‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం అంటూ.. హీరో నందమూరి బాలకృష్ణ, క్రిష్ తెలుగువారి ఆశీస్సులు కోరారు.

ఈ బయోపిక్‌లో బాలయ్య 50 గెటప్‌లలో కనిపించనున్నాడని ఓ టాక్. లేట్ గా షూటింగ్ ప్రారంభం కావటం తో సంక్రాంతి విడుదల అనుమానమే అయితే రికార్డు టైం లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని రెడీ చేసి రిలీజ్ చేసిన ఘనత క్రిష్ కి వుంది అదే స్పీడ్ తో ఎన్టీఆర్‌ మూవీని కూడా తెరకెక్కిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నందమూరి అభిమానులతోపాటు, యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

తేజ డైరెక్షన్లో ఎన్.టి.ఆర్. బయోపిక్ ప్రారంభం కాగా అనివార్య కారణాల వాళ్ళ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోటం క్రిష్ రావటం జరిగాయి!