Home రాజకీయాలు కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలి: నాగబాబు!

కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలి: నాగబాబు!

122
SHARE

హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మహేష్ పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేసారు. నాస్తికత్వం అనే ముసుగులో హిందువుల సెంటిమెంట్స్ ని కించపరిచినట్టు మాట్లాడిన కత్తి మహేష్ శిక్షింపబడాలని, లేనిచో అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని నాగబాబు అన్నారు.

మత విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని కత్తి మహేష్ ని నాగబాబు హెచ్చరించారు. హిందూ మతంపై ఓ పథకం ప్రకారం దాడి జరుగుతోందని నాగబాబు ఆరోపించారు. మత చర్చలను కూడా ప్రోత్సహించవద్దంటూ న్యూస్ చానళ్లను మెగా బ్రదర్ కోరారు.

కత్తి మహేష్ ఇటీవల హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అతని పై హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కత్తి మహేష్ ను విచారించి నోటీసులు ఇచ్చారు, విచారణను ఎదుర్కోవాలని సూచించారు.

అయితే కత్తి స్టేషన్ నుంచి ఇలా వచ్చాడో లేదో మళ్ళీ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు తన ఫేస్ బుక్ లో షేర్ చేసి దుమారం రేపాడు.

రామాయణం అనేది ఓ పుస్తకం కాదని కోట్లాది హిందువులు ఆరాధించే చరిత్ర అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం మహాభారతం అని అటువంటి వీటిని విమర్శిస్తున్న కత్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని నాగబాబు డిమాండ్ చేశారు.

ఆ మధ్య పవన్ కళ్యాణ్ ను విపరీతంగా టార్గెట్ చేసిన కత్తి మహేష్ కి ఈ రకంగా నాగబాబు దెబ్బ కొట్టడం అంతా చర్చించుకుంటున్నారు.