Home రాజకీయాలు కన్నా పై చెప్పు విసిరిన యువకుడు!

కన్నా పై చెప్పు విసిరిన యువకుడు!

174
SHARE

నెల్లూరు జిల్లా కావలిలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఓ యువకుడు చెప్పు విసిరాడు. ఆ వ్యక్తి గొర్రెపాటి ఉమామహేశ్వరరావు అని గుర్తించి బీజేపీ కార్యకర్తలు పట్టుకుని చావ చితకబాదారు.

ట్రాజెడీ ఏమిటంటే పోలీసులు ఆగ్రహంలో వున్న కర్కర్తలని ఆపటానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడిని బాధితుడిని చేసి బీజేపీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. అతని విషయమై పోలీసులు ఆరా తీయాగా ఉమామహేశ్వరరావు ఓ లారీకి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకున్నారు.

పోలీస్ విచారణలో ఉమామహేశ్వర రావు సమాజంపై విరక్తి చెందినట్టు చెప్పాడని అలానే రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేయడం కూడా చూసి తట్టుకోలేకపోయాడని అందుకే, కన్నాపై చెప్పు విసిరానని పోలీసులకు చెప్పాడు. ఇది నిజంగా బాధాకరమే…ప్రజలలో రాజకీయ అవగాహన హర్షణీయమే…కానీ పర్యవసానాలు ఇలా ఉంటే ఘోరమే!!