Home రాజకీయాలు చివరాఖర్లో నైనా ప్రజలకోసం పని చేయండి: రోజా!!

చివరాఖర్లో నైనా ప్రజలకోసం పని చేయండి: రోజా!!

119
SHARE

వైసీపీ అధినేత జగన్ పై అర్ధం పర్ధం లేకుండా విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై నగరి ఎమ్మెల్యే వైకాపా ప్రతినిధి రోజా మండిపడ్డారు. సిగ్గులేకుండా జగన్ పై నీతి లేని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక రాజకీయ నాయకుడు వై ఎస్ జగన్ మాత్రమేనని రోజా అన్నారు. జగన్ పట్ల మంత్రి దేవినేని ఉమ ప్రవర్తిస్తున్న తీరును చూస్తే టీడీపీ నేతలు ఎతువంటి వారో అర్ధమవుతుందని అన్నారు. కనీసం ఈ చివరి రోజుల్లోనైనా రాష్ట్రం కోసం పని చేయాలని టీడీపీ నేతలను తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికలతో టీడీపీ పెట్టె బేడా సర్దుకోవచ్చని చెప్పి 2019 నుంచి ఏపీని వైసీపీ పాలించబోతోందని అన్నారు.

అంతకు మునుపు ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, జగన్ కి సీఎం కావాలన్న పిచ్చితో రోడ్ల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు దేవినేని ఉమా జగన్‌ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రజలవని, వాటిని స్వాధీనం చేసుకోవాల౦టూ డిమాండ్ చేశారు.