Home సినిమా టాప్ హీరోయిన్ కూ తప్పని లైంగిక వేధింపులు?

టాప్ హీరోయిన్ కూ తప్పని లైంగిక వేధింపులు?

177
SHARE

ప్రఖ్యాత నటి,…90వ దశకంలో టాప్ హీరోయిన్ గా వెలుగొంది రాణించిన ఆమని సినీ పరిశ్రమలో లైంగిక వేదింపుల పై స్పందించారు. తాను కూడా వేధింపులకు గురయ్యాననే షాకింగ్ నిజాన్ని చెప్పారు. ఆమని నటించిన కొత్త చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు లైంగిక వేధింపుల పై అనేక విషయాలు చెప్పారు.

తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ను ఎదుర్కొన్ననిజాన్ని చెప్పారు. పేరు లేని కొత్త నిర్మాతల నుంచి తనకు ఫోన్లు వచ్చేవి అన్నారు. వారు తనని ఒంటరిగా గెస్ట్‌ హౌస్‌కు రమ్మనేవారన్నారు, తోడుగా అమ్మను కూడా తీసుకురావద్దు అంటూ చెప్పడం గుర్తు చేశారు. అయితే తనకు వారి ఉద్దేశం అర్థమై జాగ్రత్త పడ్డాన౦టూ చెప్పారు, అటువంటి ఫోన్లు పట్టించుకోవడం మానేశానన్నారు. అయితే పేరున్న దర్శకులు, నిర్మాతల నుంచి ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదని ఆమని వివరించారు. కాస్టింగ్ కౌచ్ నటీమణులకు తీవ్ర సమస్య…దీనికి పరిష్కారమెపుడో?