Home రాజకీయాలు సిఎం రమేష్ దీక్ష గిన్నిస్ లో కెక్కించాల్సిందే..!!

సిఎం రమేష్ దీక్ష గిన్నిస్ లో కెక్కించాల్సిందే..!!

208
SHARE

ఏ పీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటీవలే దీక్ష చేసి విరమించిన సీ ఎం రమేష్ ల పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సెటైర్లు బాగా పేలాయి.

మీడియా మాట్లాడుతూ విష్ణుకుమార్ రాజు..షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కడైనా అన్ని రోజులు తినకుండా ఉండటం జరిగిందా అని ప్రశ్నిస్తూ ఒకట్రెండు రోజులు తినకుండా ఉంటేనే ఉండలేని పరిస్థితి ఉంటుందని అలాంటిది సీఎం రమేష్ పదకొండు రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేయడం సాధారణ విషయం కాదని అంటూ ఈ దీక్ష రికార్డు అని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని సెటైర్లు విసిరారు. ఇటువంటి దీక్షలపై ప్రజల్లో ఉన్న నమ్మక౦ పోయిందని విమర్శించారు.

ఇక భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కూడా విమర్శలు సంధించారు. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ని విమర్శించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగటం అంటే తమ పార్టీకి పట్టిన గ్రహణం వీడినట్టయిందని అన్నారు.

కేంద్రం నిధులు వాడుతూనే బాబు దొంగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ కి రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని కేంద్రం చెబుతున్నా దీక్షలు చేయడ౦ లో అర్ధమేంటని ప్రశ్నించారు.