Home రాజకీయాలు బాబు పాపం పండే రోజు దగ్గర్లో వుంది: కృష్ణంరాజు

బాబు పాపం పండే రోజు దగ్గర్లో వుంది: కృష్ణంరాజు

500
SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపం పండే రోజు ఎంతో దూరంలో లేదని టాలీవుడ్ నటుడు మాజీ కేంద్ర మంత్రి వర్యులు కృష్ణంరాజు అన్నారు.

నిన్న విజయవాడలో విలేఖరులతో మాట్లాడిన కృష్ణంరాజు, చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ తప్పించుకో చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని అన్న ఆయన ప్రతి పనిలో చంద్రబాబు సైత౦ ప్రతి తెదేపా నాయకుడు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇక క్రియాశీల రాజకీయాల్లో తన వంతు కృషి చేస్తానని అన్న కృష్ణం రాజు అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.

తెదేపా అసత్య ప్రచారం పై మండిపడ్డ ఆయన భాజపా తో పొత్తువల్లే తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. బాబు పాపం పండే ఎంతో దూరంలో లేదని అన్న అయన ప్రభాస్ రాజకీయ రంగప్రవేశం పై మాట్లాడుతూ ప్రభాస్ ఇప్పుడిప్పుడే పరిశ్రమలో ఎదుగుతున్నాడని రాజకీయాలకి చాలా సమయం ఉందన్నారు….ఎన్నికల్లో ప్రచారానికి ప్రభాస్‌ను ఉపయోగించుకుంటారా అన్న ప్రశ్నకు అసలా ఉద్దేశమే తమకు లేదని తేల్చి చెప్పారు.