Home రాజకీయాలు పవన్ సీఎం అంటూ కమ్యూనిస్టుల వత్తాసు!!

పవన్ సీఎం అంటూ కమ్యూనిస్టుల వత్తాసు!!

SHARE

ఆఖరికి కమ్యూనిస్టులు ఇంతకీ పడిపోయారా అని అనిపించక మానదు సిపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు వింటే. రాబోయే ఎన్నికల్లో మహా కూటమి కానక ఉంటే దానికి పవన్ కళ్యాణ్ సిఎం అభ్యర్థి అట!

ఒకప్పుడు తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ చూసి రాజకీయ పార్టీలు విస్తుపోయాయి…అసలు తమ పార్టీ లు చిరు క్రేజ్ తట్టుకోగలవా అని…సీన్ కట్ చేస్తే ప్రజారాజ్యం కేవలం౧౯ సీట్లతో సర్దిపెట్టుకోవలసి వచ్చింది. ఇక సీన్ ఇప్పటికి కట్ చేస్తే పవన్ కళ్యాణ్ జన సేన…మరలా అదే క్రేజు, సభలు వాటికొచ్చే జనం….. నీరాజనం…ఎట్సెట్రా ఎట్సెట్రా. పవన్ సభలోకొచ్చే జనం చూసి కమ్యూనిస్టులు జన సేన పై జన సేనాని పై మనసు పారేసుకున్నట్టు వున్నారు…రోజుకోసారి తాము జన సేన తో కూటమి చేస్తాం అంటున్నారు.

తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. పవన్ కళ్యాణ్ ను ఓ ఆకాశానికి ఎత్తేశారు. మహాకూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణేనని కూడా అన్నారు. అంతేనా పవన్ కు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్నారు. ప్రజల్లో పవన్ కు ఉన్న ఇమేజ్, క్రేజ్, మంచి వ్యక్తిత్వం దృష్ట్యా ఆయనే సీఎం అయితే బాగుటుంది అని కూడా అభిప్రాయపడ్డారు. మహాకూటమిలో జనసేన, సీపీఐ, సీపీఎంతో పాటు లోక్ సత్తా ఉంటుందని ఆయన మొన్ననే అన్నారు.

అసలు మహాకూటమికి జనసేనకు అర్హత ఉందా? పార్టీ కి ఇంకా క్యాడర్లు లేవు…నాయకులు లేరు..వాపు చూసి బలుపు అని కమ్యూనిస్టులు అనుకుంటున్నాయి కానీ వాస్తవానికి ఎర్రజెండా నాయకులూ క్షేత్రస్థాయికి వెళ్తే పరిస్థితి ఏంటనేది అవగాహన కి వస్తుంది. అసలు తమ ఉనికి కోసం కమ్యూనిస్టులు పవన్ ఆసరా కావాలంటున్నారు…ఎంత దౌర్భాగ్యం!!