Home రాజకీయాలు గంటా కు ఎర్త్ పెడుతున్న బాలయ్య చిన్నల్లుడు..!!

గంటా కు ఎర్త్ పెడుతున్న బాలయ్య చిన్నల్లుడు..!!

SHARE

ఆంధ్రప్రదేశ్ లోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైన విశాఖపట్నం నుంచి తదుపరి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హీరో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని భర్త భరత్ ని రంగంలోకి దింపటానికి రంగ౦ సిద్ధం అవుతోంది.

ఈ టికెట్ ను గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి ఆశిస్తున్న తరుణంలో తనకి సీటివ్వటం కుదరని పక్షంలో తన వారసుడిగా మనవడైన భరత్ కు సీటు ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి ఇప్పటికే అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

విశాఖ వాసులు మొదట్నుంచీ బయటి నుంచి వచ్చిన వారికే పెద్దపీట వేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి విజయమ్మను ఓడించి, బీజేపీకి చెందిన హరిబాబుకు ప్రజలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి హరిబాబు పోటీ చేసేందుకు ఆసక్తి లేకపోవటం గమనించదగ్గ విశేషం. పొత్తులో భాగంగా ఈ సీటు తెలుగుదేశం పార్టీ బీజేపీ కి ఇచ్చింది. హరిబాబు పోటీ చేయని నేపధ్యం లో ఈ ప్రాంత వాసుడైన నేత, ఓటమెరుగని నేత గంటా శ్రీనివాస్ ను లోక్ సభకు పంపాలని తెలుగుదేశం హై కమాండ్ ఆలోచన. ఈ విషయ౦ పై ఇంకా ఏ అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు అయితే వచ్చిన చిక్కల్లా లోకేష్ తోడల్లుడు భరత్ రాజకీయాల్లోకి రావాలనుకోవటం. ఈ విషయంలో బాలయ్య పట్టుదల ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

మరి గంటాకు ఎర్త్ పెడుతున్నట్టేనా …?