Home సినిమా చేతులు కాలాక ఆకులు…శంభో షకలక శంకర్!!

చేతులు కాలాక ఆకులు…శంభో షకలక శంకర్!!

587
SHARE

షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శంభో శంకర’ చిత్రం విడుదలైంది…అయితే బి సి సెంటర్ లలో అవెరేజ్ టాక్ తెచ్చుకుంది…ఏ  సెంటర్ లలో ప్లాప్ టాక్ తో ఓపెన్ అయింది. కానీ విశేషమేమిటంటే తొలి రోజే 2 కోట్ల 53 లక్షల గ్రాస్‌ వచ్చేసిందహో అంటూ సినిమాని ప్రమోట్‌ చేయటం…ఇది శంకర్ రికార్డుగా పేర్కొనటం. ౨ కోట్ల రికార్డులు కూడా చెప్పుకోవాలా అంటూ ఆశ్చర్యపోవటం జనాల వంతైంది.

కమెడియన్‌గా జబర్దస్త్ స్కిట్ లతో పాపులర్‌ అయిన శంకర్‌ హీరోగా సంబంధమే లేని ఓ జోనర్‌ని ఎంచుకుని బోల్తా పడ్డాడు…పోనీ రెండో సినిమాకైనా ఆ తప్పు దిద్దుకున్నాడా అంటే …అబ్బే..!! కమెడియన్‌ సినిమాలో కామెడీ లేకపోవడం ఏంటి సోది కాకపోతే.

అదొక సంగతైతే రికార్డుల హంటర్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఓ ఊకదంపుడు ల పోస్టులూ పోస్టర్లూ…..సునీల్ అంతటి కమెడియన్ కె ఫ్లాపులు తప్పలేదు…అంతటి ఆర్టిస్టు కె కెరీర్‌ అయోమయంలో వుంది ….నువ్వెంత శ౦కరూ..?? ప్రీ-రిలీజ్ ఈవెంటులో కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్టాడి ఉంటే ఇంత ఘోరమైయ్యేది కాదు గా శంకర్‌?

ఇప్పుడొచ్చి అడి కేవలం సినిమా ప్రమోషన్‌కి మాట్లాడానని….సరదాగా మాట్లాడానని నాలుక కరుచుకుని ఎం ప్రయాజనం ….చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయ్యింది శంకర్ గారి పరిస్థితి!! శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్‌ కొండేటి నిర్మించారు. విడుదలకు ముందు కొంచం అంచనాలు పెంచిన మాట వాస్తవమే కానీ విడుదలయ్యాక శంకర్‌ పరిస్థితి మరీ బ్యాడైంది. కామెడీ జోనర్‌ తీస్కొని ఉంటే బాగుండేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

శంకరేంటి ఆ పవర్‌ఫుల్‌ డైలాగులేంటి యాక్షన్‌ ఎపిసోడ్స్‌, రక్తపాతం, సెంటిమెంట్‌ …అబ్బో ఇలా అస్సలు సంబంధమే లేని ఎమోషన్స్‌తో బాబోయ్ అనేలా విసిగించేశాడు…!!