Home రాజకీయాలు బాబు పీఎం కావాలంట…లేకుంటే దళిత పీఎం అయినా ఒకే..!!

బాబు పీఎం కావాలంట…లేకుంటే దళిత పీఎం అయినా ఒకే..!!

SHARE

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాల జోడీ అసమర్థ జోడి అంటూ…వీరి నాయకత్వం వల్లనే దేశ వ్యాప్తంగా ప్రతి 15 నిమిషాలకి దళితుల మీద దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.దళిత తేజం-టీడీపీ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న వార్ల మాట్లాడుతూ ప్రతిరోజు ఆరుగురు దళిత మహిళల పై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఇంకా మోదీ, అమిత్‌ షాల జోడి పై చంద్రబాబు పోరాటం చేయటానికి పూనుకున్నారన్నారు.

బాబు కి అప్పీల్ చేస్తూ వర్ల: మా ఆవేదనను దృష్టిలో పెట్టుకోండి. అప్పట్లో జగ్జీవన్‌ రామ్‌ని ప్రధాని కాకుండా అడ్డుకున్నారు. అప్పట్లో చంద్రబాబు లాంటి నాయకుడు ఉంటే అప్పట్లోనే ఓ దళితుడు ప్రధానమంత్రి అయ్యుండేవారు. మీ హయాంలో ఓ దళితుడు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి. మీరు ప్రధానిగా ఉంటారా…. మాకు అది సంతోషం, మీరు దేశానికి నాయకత్వం వహిస్తారా….మాకు సంతోషం. లేదంటే మాత్రం దళిత నాయకత్వాన్ని దేశ అత్యున్నత స్థాయిలో నిలపాలని కోరుకుంటున్నాం అంటూ ఆవేశంతో ఊగిపోయారు మన వర్ల. కొంపదీసి ఈయనే పీఎం అవుతానంటాడా ఏందీ??