Home రాజకీయాలు “ప్రజలు తంతారన్న భయం తో తెలంగాణ ఇచ్చారు”

“ప్రజలు తంతారన్న భయం తో తెలంగాణ ఇచ్చారు”

119
SHARE

సోనియా పై కేటీఆర్ ఈ మధ్య చేసిన కామెంట్లు సంచలనాత్మకమైనాయి. తెలంగాణ ఐ టీ మినిస్టర్ కామెంట్లు సోనియా కి తెలంగాణా కి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా వున్నాయి.

తెలంగాణ ఇచ్చింది అమ్మ కాదు బొమ్మకాదు ప్రజలు కొట్లాడుకుని గుంజుకుంటేనే తెలంగాణ వొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలు తంతారన్న భయం తో విధి లేని పరిస్థితిలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది అని కామెంట్ చేయటం రాజకీయ వర్గాల్లో దుమారం లేపింది.

బహుశా కేసీఆర్ కూడా సోనియా తలపెట్టకపోతే తెలంగాణా రాష్ట్ర౦ సిద్దించేది కాదని అంటారేమో. ఒకవేళ సోనియా కి తెలంగాణకి ఏ సంబంధం లేకపోతే రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్ లో పాస్ అయినాక ఎందుకట కేసీఆర్ కుటుంబం ఢిల్లీ వెళ్లి సోనియా కి థాంక్స్ చెప్పుకొచ్చారు?

ఇక ఎలక్షన్లు ఎంతో దూరం లో లేకపోటంతో కేటీఆర్ సారు ప్రజలకి కేసిఆర్ కష్టం, త్యాగం, ఆయనొక్కడివల్ల తెలంగాణ సిద్దించింది అని గుర్హ్టుచేయటానికి కాబోలు…కానీ ప్రజలేం వెర్రివాళ్ళు కారు కదా…చేసింది చేయండి అన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు.ఏమంటారు?