Home రాజకీయాలు చేసేది 100రూ పని…ప్రచారానికి మాత్రం 1000రూపాయలు

చేసేది 100రూ పని…ప్రచారానికి మాత్రం 1000రూపాయలు

SHARE

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద రూపాయలుచేసే పని కి వెయ్యిరూపాయల ప్రచారం చేయించుకుంటారని పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. దళిత తేజం అంటూ కొత్త పేరుతో నెల్లూరులో సభ పెట్టడాన్ని మోత్కుపల్లి గేలి చేశారు.

తనకున్నా మీడియా అండతో చంద్రబాబు అసత్యపు ప్రచారాలు చేసుకుంటున్నారని వాపోయారు. అయితే ఈ రోజు ప్రజలు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. పేదలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తున్నానని చెప్తుంటారని ఆయనేం జేబులో దుబ్బు ఇస్తున్నారా అని ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందని మోత్కుపల్లి అన్నారు. అయినా బాబు చేస్తుంది కొంత ప్రచారమేమో కొండంత అని అన్నారు…100రూపాయల పనికి 1000రూపాయల ప్రచారమేంటని అన్నారు.

రేపు జగన్ అదికారంలోకి వస్తే 3000 పెన్షన్ ఇస్తానని చెబుతున్నారని, పవన్ కళ్యాణ్ మూడు వేలు ఇస్తానని అంటున్నారని ఆయన గుర్తుచేశారు. పేదలకు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాబు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరుగుతుంటారని…అదంతా ఎవరి డబ్బు అని మోత్కుపల్లి ప్రశ్నించారు.

దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణ రెడ్డి పై బాబు ఉదాసీనత ఎందుకని ఆయన ప్రశ్నించారు.