Home సినిమా శంభో శంకరకు కలెక్షన్ల సునామీ..

శంభో శంకరకు కలెక్షన్ల సునామీ..

603
SHARE

హీరోగా శంకర్‌కు తొలి సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించిందని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

శంభో శంకర్ చిత్రాన్ని 585 థియేటర్లలో రిలీజ్ చేశాం. మొదటి రోజు మా చిత్రం 2 కోట్ల 5 లక్షల 18 వేల 125 రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ కలెక్షన్ల సునామీని ఎవరూ ఆపలేరు అని పోస్టర్‌లో పేర్కొన్నారు.

ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అంటూ నిర్మాత సురేష్ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు. వై రమణారెడ్డితో కలిసి సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంభో శంకర చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. మాస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నదని చిత్ర యూనిట్ పేర్కొన్నది.