Home రాజకీయాలు ముగిసిన ఉక్కు డ్రామా.. సీఎం రమేష్ కు చంద్రబాబు నిమ్మరసం

ముగిసిన ఉక్కు డ్రామా.. సీఎం రమేష్ కు చంద్రబాబు నిమ్మరసం

296
SHARE

హమ్మయ్య.. టిడిపి ఎమ్.పి సి.ఎమ్.రమేష్ దీక్ష విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. తొలుత చంద్రబాబు, మంత్రి లోకేష్ లు వచ్చి రమేష్ ను పరామర్శించారు. డపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20న సీఎం రమేష్ దీక్షకు దిగారు. ఈయనతో పాటు ఎమ్మెల్సీ బిటెక్ రవి కూడా దీక్ష చేసినా ముందుగానే విరమించారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే వరకు ఆగి దీక్షను విరమించడం ఆసక్తికరంగా మారింది.

బీపీ..షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలున్న ఒక నేత ఏకంగా పదకొండు రోజుల పాటు దీక్ష చేస్తున్న వైనంపై ఇప్పటికే వెల్లువెత్తిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ  దీక్ష చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద వచ్చినన్ని జోకులు అన్నిఇన్ని కావు.

రమేష్ దొంగ దీక్ష చేశారని, అందువల్లే పదకుండు రోజులు చేసినా ఆయన ఎలాంటి ఇబ్బంది పడలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏకంగా ఏపీ టీడీపీ ఎంపీలే ఢిల్లీలో తాపీగా కూర్చొని.. నాకూ ఐదు కిలోలు తగ్గాలని ఉంది.. వారం దీక్ష చేసే ఛాన్స్ ఇవ్వండంటూ ఎటకారం చేసుకున్న వైనంవీడియో క్లిప్పు సాక్షిగా బయటకు రావటంతో.. తెలుగు తమ్ముళ్లు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.