Home రాజకీయాలు చికాగో సెక్స్ రాకెట్: బాబు సన్నిహితులకు నోటీసులు

చికాగో సెక్స్ రాకెట్: బాబు సన్నిహితులకు నోటీసులు

1203
SHARE

అమెరికాలో బయల్పడిన సెక్స్ రాకెట్ లో రోజుకో సంచలనం బయటపడుతోంది. ప్రస్తుతం ఈ రాకెట్ లో అరెస్ట్ అయిన కిషన్ మోదుగుమూడి-చంద్రకళ దంపతులు పోలీసుల విచారణలో నోరు విప్పుతున్నారు. దీంతో ఈ వ్యవహారంతో సంబంధమున్న అమెరికాలోని తెలుగు ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు.

తానా డాక్యుమెంట్లను కొంత మంది ఫోర్జరీ చేసి అమెరికా వీసాలు పొందటానికి వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుత తానా అధ్యక్షుడు సతీష్ వేమన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలోని  తెలుగు సంఘాల ప్రతినిధులకు కూడా ఈ వ్యవహారంలో ప్రమేయముందని వార్తలు వెలువుడుతున్నాయి.

అమెరికాలో తానా  ప్రెసిడెంట్ సతీష్ వేమన, టీడీపీ కీలక నేతలుగా  ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కోమటి జయరాం, గంగాధర్ లను కూడా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు నోటీసులు (సబ్ పినో) ఇచ్చినట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. వీరు అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా చలామణి అవుతున్నారు. వీరిని గత ఏడు సంవత్సరాల లో జరిపిన బ్యాంకు లావాదేవీలు – బ్యాంక్ ట్రాన్సాక్షన్ పై ఆరా తీస్తారట.  వాటిని బట్టి ఈ సెక్స్ రాకెట్ లో సదురు నేతల  ప్రమేయం ఉందా లేదా అన్న విషయాలపై అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం.

మరోవైపు అధికారుల విచారణతో ఎన్ ఆర్ ఐ లలో  ఆందోళన మొదలైంది. కిషన్ తో లావాదేవీలు జరిపిన చాలా మంది ప్రముఖులు తాము దొరికిపోతామంటూ  ఆందోళన చెందుతున్నారట. ఇలా పోలీసుల విచారణతో తీగలాగితే డొంక కదులుతోంది.

ఒకవేళ సెక్స్ రాకెట్ లో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఉన్న తానా ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ అయితే మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఇరుకునపడడం ఖాయం. దీనిపై బాబు ఎలా స్పందిస్తాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ముగ్గురికి నోటీసులు  జారీ చేసినట్లు.. విచారణ చేపట్టినట్లు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వార్త వెలువడలేదు.