Home సినిమా ‘యాత్ర’ లో రాయలసీమ డేరింగ్ లీడర్‌గా అనసూయ?

‘యాత్ర’ లో రాయలసీమ డేరింగ్ లీడర్‌గా అనసూయ?

SHARE

‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్త లాంటి పవర్ ఫుల్ పాత్రలో అనసూయ నటన సినిమాకే హైలెట్ అయింది. ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అనసూయ దశ తిరిగిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తినా సెలెక్టెడ్‌గా పాత్రలు ఎంచుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. రంగస్థలం తరహాలోనే పవర్ ఫుల్ పాత్ర చేసే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘యాత్ర’లో ఈ హాట్ యాంకర్ ఎంపికైనట్లు సమాచారం.

భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.