Home రాజకీయాలు వావ్…11రోజుల దీక్ష వెంటనే సిఎమ్ రమేష్ 5 నిమిషాల స్పీచ్!

వావ్…11రోజుల దీక్ష వెంటనే సిఎమ్ రమేష్ 5 నిమిషాల స్పీచ్!

232
SHARE

కడప స్టీల్ ప్లాంట్ కోసం మొత్త౦ ఎంఎల్ఏ లంతా రాజీనామాలు చేద్దామని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాద్ రెడ్డి సవాల్ చేశారు. టిడిపి ప్రజా ప్రతినిదులు,వైకాపా ప్రజా ప్రతినదులు మొత్తం అంతా రాజీనామా చేస్తే నిరసన తెలిపితే కడప స్టీల్ ప్లాంట్ ఎ౦దుకు రాదో చూద్దా౦ అని ఆయన అన్నారు. సిఎమ్ రమేష్ నిరాహార దీక్ష కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఉందని ఆయన వాపోయారు.

సీఎం చంద్రబాబు 11 రోజుల తర్వాత వచ్చి తుస్సు మనిపించాడని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అలానే
11 రోజుల దీక్ష తర్వాత కూడా సీఎం రమేష్‌ 5 నిమిషాలు పాటు అనర్గళంగా ఎలా మాట్లాడగలిగాడో అని విసుర్లు విసిరారు…అసలు సీఎం రమేష్ దీక్ష పై నిపుణులు రీసెర్చ్‌ చేసి ఆ రహస్యం పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి అన్నారు.

అధికారులు జిల్లా పరిపాలన వదిలేసి, కలెక్టర్‌ కూడా సీఎం రమేష్ సేవలో మునిగి తేలారన్నారు. దీక్ష నిమిత్తం 540 ఆర్టీసీ బస్సులువాడారని ఆరోపించారు. కడప ఉక్కు కోసం అందరం రాజీనామా చేద్దాం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు రాదో చూద్దాం’ అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.