Home రాజకీయాలు వైరల్ వీడియో: దీక్షలపట్ల టీడీపీ అభిప్రాయం ఇది!

వైరల్ వీడియో: దీక్షలపట్ల టీడీపీ అభిప్రాయం ఇది!

292
SHARE

కళ్లకు కనిపించే ప్రతీదీ వాస్తవం కాదు.. అలా కని కనిపించని ప్రతీదీ అబద్దమూ కాదు. కడప ఉక్కు పరిశ్రమ కోసం, ఏపీకి రావాల్సిన విభజన హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం.. మీడియా సపోర్ట్ లేకపోయినా ఇంతకాలం ఢిల్లీ వేదికగా వైకాపా ఎంపీలు చేసిన పోరాటం ప్రచారాలు భారీస్థాయిలో రాకపోయినా అది అబద్దం కాదు!! తాజాగా కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న “ఆమరణ” దీక్ష నిజమూ కాదు! ఇలా చెప్పడానికి.. దీక్షలపై టీడీపీ నేతలకు ఉన్న అభిప్రాయం గురించి.. చెప్పడానికన్నట్లు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.

చేసేపనిలో చిత్తశుద్ధి శూన్యం.. పబ్లిసిటీ మాత్రమే ధ్యేయం అన్నట్లుగా సాగిపోతుంది టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న దీక్ష అనే కామెంట్స్ ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్నాయి. కడపకు ఉక్కు పరిశ్రమ తేవాలంటూ సీఎం రమేశ్ చేస్తున్న దీక్షలతో ఏమీ కాదంటూ తేల్చేయటమేకాదు.. ఉక్కు..తుక్కు అంటూ తేలిగ్గా తీసిపాడేశారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి! అయితే… ఈ వీడియో చూసిన అనంతరం… జేసీనే కాదు, బాబు నాయకత్వంలో పనిచేస్తున్న టీడీపీ ఎంపీలంతా ఒక తానులో ముక్కలే అని ఒక నిర్ణయానికి ఒచ్చెయ్యొచ్చు!

తాజాగా ఒక గదిలో కూర్చుని పిచ్చా పాటీ మాట్లాడుకుంటున్న టీడీపీ ఎంపీలకు సంబందించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియోలో మాట్లాడుతున్న ఎంపీ మురళీ మోహన్, జేసీని, మిగిలిన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ… “ఏమండీ.. నాకు ఐదు కేజీల బరువు తగ్గాలని ఉంది.. అవకాశమిస్తే వారం రోజుల దీక్ష చేస్తాను” అని చులకగనగా మాట్లాడుతూ వెకిలి నవ్వులు నవ్వుతున్నారు! ఈ భేటీలో మురళీమోహన్ తో పాటు జేసీ, గల్లా, మాగంటి, కేశినేని, రేణుక తదితర నేతలంతా ఉన్నారు.

ఈ లెక్కన చూసుకుంటే… ఓవైపు ఏదో చేసేస్తాం, కేంద్రం మెడలు వంచేస్తాం, పొడిచేస్తాం అంటూ మీడియా ముందు రంకెలు వేసే తెలుగు తమ్ముళ్లు.. గదిలో కూర్చున్నప్పుడు మాత్రం ఇలా వెకిలి మాటలు మాట్లాడుకుంటూ, దీక్షలపై వారికున్న అభిప్రాయాన్ని, జనాలను వెర్రివళ్లను చేసే వారి ఆలోచనలను బయటపెడుతుంటారన్నమాట! ప్రజలు అన్నా, దీక్షలు అన్నా, ప్రజల అభిప్రాయాలు అన్నా టీడీపీ నేతలకు ఎంత చులకన అయిపోయిందో కదా!!