Home సినిమా స్టార్స్‌తో సినిమా తీయడం రిస్క్‌: త‌రుణ్ భాస్క‌ర్‌

స్టార్స్‌తో సినిమా తీయడం రిస్క్‌: త‌రుణ్ భాస్క‌ర్‌

152
SHARE

విశ్వక్‌సేన్‌, సాయి సుశాంత్‌, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమటం, అనీషా అంబ్రోస్‌, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడు. డి.సురేశ్‌ బాబు నిర్మాత. ఈ సినిమా జూన్‌ 29న విడుదలవుతుంది. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌తో ఇంట‌ర్వ్యూ..

`పెళ్ళిచూపులు` రిలీజ్‌.. నేటికీ తేడా ఏంటి?

అవార్డులు, రివార్డుల‌ను ప‌క్కన పెడితే రెండింటికీ కొద్దిగా బ్యాలెన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకు బాగా కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. ఎందుకంటే బ‌డ్జెట్ కంట్రోల్ లేకుండా ఉండ‌టం అనేది ఎఫెక్ట్ ఉంటుంది. కాబ‌ట్టి ఇది బాగా వ‌చ్చింద‌నే న‌మ్మ‌కం ఉంది.

రెండేళ్లు గ్యాప్ తీసుకోవ‌డానికి రీజనేంటి?

కొత్త వాళ్లతో కథ చెప్పడానికి స్కోప్‌ ఎక్కువ ఉంటుంది. స్టార్స్‌తో అయితే కథ వాళ్ల చుట్టూ తిరగాలి. అలా రాయడం నాకు కొత్త. నిజమైన రిస్క్‌ స్టార్స్‌తో సినిమా తీయడమే. కొత్తవాళ్లతో ఆల్రెడీ చేశాను. అదే నమ్మకంతో ‘ఈ నగరానికి ఏమైంది’  చేశా.

మ‌ళ్ళీకొత్త‌వాళ్ల‌తోనే ఎందుకు సినిమా చేశారు? స్టార్ హీరోలెవ‌రూ మిమ్మ‌ల్ని సంప్ర‌దించ‌లేదా?

‘పెళ్ళిచూపులు’ హిట్‌ తర్వాత చాలా మంది హీరోలు జెన్యూన్‌గా అప్రిషియేట్‌ చేశారు. మంచి పాయింట్‌ ఉంటే అప్రోచ్‌ అవ్వమన్నారు. సినిమా పూర్తిగా అర్థం అవ్వాలి. అది అయ్యాక  వాళ్లను అప్రోచ్‌ అవ్వాలనుకుంటున్నా.

ఈ టైటిల్ ఎందుకు పెట్టారు?

జనంలో క్యూరియాసిటీ పెంచడం కోసమే కాకుండా సినిమాలో మెయిన్‌ థీమ్‌ కూడా అదే ఉండటంతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. ఈ టైటిల్‌ నా ఫ్రెండ్‌ కౌశిక్‌ చెప్పారు. సురేశ్‌బాబుగారు కూడా బావుంది అనడంతో ఫిక్స్‌ అయ్యాం. తాగుడుకు బానిసత్వం గురించి ఈ సినిమాలో డిస్కస్‌ చేశాం. ఫన్నీ ఎంటర్‌టైనింగ్‌ మూవీ.

తర్వాతి సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. ముందు కథ రాస్తా. అది ఎవరికి సూట్‌ అవుతుందనిపిస్తే వాళ్లను అప్రోచ్‌ అవుతా.