Home రాజకీయాలు 2019లో ఏపీ లో త్రిముఖ పోటీ అట!

2019లో ఏపీ లో త్రిముఖ పోటీ అట!

169
SHARE

రానున్న 2019 ఎన్నికల్లో ఏపీ లో త్రిముఖ పోటీ ఉంటుందని సీపీఎం మధు అభిప్రాయపడ్డారు. ముందు వరసలో జనసేన ఉంటే, వైసీపీ ఆ పై టీడీపీ తరువాతి స్థానాల్లో ఉంటాయని ఆయన అన్నారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన జనసేన మొదటి స్థానంలో, వైసీపీ రెండో స్థానంలో, టీడీపీ మూడో స్థానంలో ఉంటాయని జోస్యం చెప్పారు.

మధు ప్రజలలో టీడీపీ పాలనపై తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. అలానే వైకాపా ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమైందని అందుకే ప్రజలు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీకి పట్టం కట్టాలని భావిస్తున్నారని అన్నారు.

ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతల దీక్షను స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిశ్రమ సాధనకై త్వరలో ఏపీ బంద్ కు పిలుపు నిస్తామని కూడా మధు చెప్పారు. రాష్ట్రంలో నష్టపోయిన మామిడి రైతులు, పాల ఉత్పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.