Home రాజకీయాలు ఛీ ఛీ…తెదేపా నైజం బట్ట బయలు…!!

ఛీ ఛీ…తెదేపా నైజం బట్ట బయలు…!!

2497
SHARE

కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఇక్కడ బాబు ఓ పక్క బిల్డ్ అప్ ఇస్తుంటే ఆ పార్టీ ఎంపీ లు ఢిల్లీ లో దీక్షలని వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాం కింద మార్చి వెటకారాలు, జోకులు.

విషయాన్ని కొస్తే కడప లో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు టీడీపీ ఎం పీ లు నాయకులు ఢిల్లీ లో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను కలవటానికి వెళ్ళినపుడు అక్కడ లాబీ కూచుని ఇలా పిచ్చి జోకులు వేసి దీక్ష స్ఫూర్తి పై నీళ్లు చల్లారు.

మురళి మోహన్ తాను ఓ 5కిలోలు బరువు తగ్గాలనుకుంటున్నట్టు చెప్పి దానికి ఓ వారం రోజులు నిరాహార దీక్ష చేయగలను అన్నారు. జేసీ కలగజేసుకుని అవంతి శ్రీనివాస్ ని కూచోపెడదాం అని వ్యాఖ్య చేశారు. దానికి కనకమేడల స్పందిస్తూ గతంలో అవంతి శ్రీనివాస్ ని మొదటి రోజే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో జేర్పించిన విషయం గుర్తు చేసి ఆయనెందుకన్నారు….వీరి సంభాషణ ఆడియో వీడియో నెట్టింటిలో హల్చల్ అవుతోంది.

ఇదేనా వీరి ఉద్యమ స్ఫూర్తి? వీరికే ఇలా ఉంటే ఎవరి సపోర్ట్ లేదని అనుకోవటం కూడా వేస్ట్, కదా?? ఈ వీడియో చూడండి: https://www.youtube.com/watch?time_continue=58&v=furqHvsgIoA