Home రాజకీయాలు పవన్‌ అభిమానులపై మరోసారి శ్రీరెడ్డి ఫైర్!

పవన్‌ అభిమానులపై మరోసారి శ్రీరెడ్డి ఫైర్!

140
SHARE

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్‌ను టార్చర్ పెడుతున్నఆయన అభిమానులపై శ్రీరెడ్డి విరుచుకుపడింది. రేణు ఇటీవలే నిశ్చితార్ధం చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికింది. ఆ విషయం ప్రకటించటం మొదలుకొని పవన్ అభిమానుల రచ్చ చెప్పనలవి కాదు. రేణు ని వేధిస్తూ ట్రోల్ చేశారు.

వారి వ్యాఖ్యలు తట్టుకోలేక తన ట్విట్టర్ అకౌంట్‌ని ఏకంగా డీ-యాక్టివేట్ చేసుకుంది రేణు దేశాయ్. పవన్ అభిమానుల మితిమీరటంతో శ్రీ రెడ్డి ఆమెకు మద్దతుగా నిలిచారు.

రేణు చిన్న వయసులో విడాకులు తీసుకున్నారు.. …కారణాలేమైనా.. దానిపై మనం మాట్లాడాల్సిన అవసరం లేదు…..అసలు ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మన కు లేదు అన్నారు. ట్విట్టర్‌లో కనీసం తమ పేరు, ఫోటో లేకుండా నకిలీ అకౌంట్లతో కూడా రేణు ని వేధిస్తున్నారని మండిపడ్డారు.

పూణేలో ఒంటరిగా ఉంటున్న ఆమెని ఎందుకు విమర్శిస్తున్నారు అని అడిగారు. తన ఇబ్బందులు ఎవరికైనా తెలుసా, తెలియనప్పుడు ఆమెని వేధించటం ఎందుకు అంటూ మంది పడ్డారు.

ఆమె కష్టాల్లోఆదుకోనప్పుడు, మద్దతుగా నిలవనప్పుడు, ఆమె కష్టాల్లో పాలుపంచుకోనప్పుడు విమర్శించే అధికారం మనకెక్కడిది అంటూ శ్రీ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ ని అభిమానిస్తే మంచిదే కానీ రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ ఆమెని ఈ స్థాయిలో విమర్శించే అధికారం మాత్రం ఎవ్వరికీ లేదు అని అంటూ శ్రీ రెడ్డి పవన్ ఫాన్స్ పై విరుచుకుపడ్డారు.