Home రాజకీయాలు నందమూరి వారు వైసిపీకి??

నందమూరి వారు వైసిపీకి??

SHARE

ఆంధ్ర తెలంగాణల్లో ఎన్నికల వేడి స్లో గా రాజుకుంటోంది …రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటే మారుతున్నాయి. ముఖ్యంగా కొందరు పార్టీలు మారుతున్న వైనాలు కూడా చూస్తున్నాం. అయితే ఈ రోజా కొత్త పుకారు రాజకీయ వర్గాల్లో షికారు చేస్తోంది. అదేమిటంటే ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్టీఆర్ గారి కుమారుడు నందమూరి హరికృష్ణ, త్వరలో వైసిపి గూటికి చేరనున్నారట.

కొన్నాళ్లుగా తెదేపా లో ప్రాధాన్యం లేకుండా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు ఏదో మొక్కుబడిగా హాజరవుతూ ఉన్నారు. అసలు పార్టీ లో అవమానాలు తట్టుకోలేక ఎప్పటినుండో పార్టీ మారాలని చూస్తున్నారని విన్నాం.

వైసిపి అధినేత జగన్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలుసుకునేందుకు సర్వం సిద్ధమయినట్లు వార్త. ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్రలో వున్న జగన్ వారాంతంలో హైదరాబాద్ వస్తుండడంతో అప్పుడు ఆయన హరికృష్ణను కలవనున్నట్లు చెపుతున్నారు.

ఇది ఒట్టి రూమరా లేక ఇందులో ఏమైనా విషయముందా అంటే వెయిట్ చెయ్యాల్సిందే!!