Home రాజకీయాలు 200 రోజు.. జగన్ ఇచ్చిన మాట ఇది!

200 రోజు.. జగన్ ఇచ్చిన మాట ఇది!

401
SHARE

అలుపెరగని పోరాట యోధుడు అనాలో లేక ప్రజా సమస్యల విషయంలో దృఢ సంకల్పం కలిగిన నాయకుడు అనాలో కానీ… ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి, నేనున్నాను అనే భరోసా కల్పించడానికి, భవిష్యత్తుపై ఆశలు కల్పించడానికి జగన్ ఎన్నుకున్న మార్గం.. పాదయాత్ర! ప్రతికూల వాతావరణానికి వెరవక.. అనారోగ్యాన్ని లెక్క చేయక.. అధికారపక్షం పెట్టే రాజకీయ ఇబ్బందుల్ని తట్టుకుని మొక్కోవోని దీక్షతో ముందడుగు వేస్తున్నా జగన్ పాదయాత్ర 200వ రోజుకు చేరింది. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటూ ముందుకు సాగుతున్న జగన్… ప్రజలకు మాట ఇస్తూ.. తాజాగ ఒక ట్వీట్ చేశారు!

వణికే చలితో మొదలుపెట్టి, వర్షాలకు తగ్గక, 40 డిగ్రీలకు పైగా ఉన్న మండుటెండను లెక్క చేయకుండా సాగుతున్న జగన్ పాదయాత్ర 200 రోజులకు చేరింది. ఈ క్రమంలో ఇప్పటివరకూ జగన్ 2434 కిలోమీటర్లు నడిచారు. అలుపెరగక సాగుతున్న ఈ ప్రజా సైనికుడికి ఏపీ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంత ప్రజలు భారీగా పోటెత్తుతున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా ఆయన వెంట సాగుతున్నారు. అధికాపక్షానికి లోలోపల దడ పుడుతున్నా… పైకి ఢాంబికాలు పలుకుతున్నా.. జగన్ మాత్రం తనదైన శైలిలో పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో జగన్ తన పాదయాత్ర స్టార్ట్ చేసి 200 రోజుల మైలురాయికి చేరుకున్న సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. దివంగత మహానేత వైఎస్ పాలనను ఏపీలో తిరిగి తీసుకొచ్చి.. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన సంకల్పం.. అని స్లష్టం చేసిన జగన్… నాలుగేళ్ల బాబు పాలనను ఎండగట్టారు. ఏపీలోకి తిరిగి రాజన్న రాజ్యాన్ని తేవటమే తన సంకల్పమని.. అలా చేసి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తన లక్ష్యమని తాజా ట్వీట్ లో వైకాపా అధినేత పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర అమలాపురంలో నిర్వహిస్తున్నారు.