Home రాజకీయాలు ఫ్యాన్స్ టెన్షన్.. రిస్కేమో చినబాబూ?

ఫ్యాన్స్ టెన్షన్.. రిస్కేమో చినబాబూ?

SHARE

ఏమనుకున్నారో ఏమో కానీ… రాబోయే ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పోటీకి దిగుతానని, పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్! ఇది నిజంగా చెప్పిన మాటా లేక మీడియాతో చిట్ చాట్ కాబట్టి.. కాస్త సరదాగా వ్యాఖ్యానించారా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది! ఎందుకంటే… గతంలో ఒకసారి ఇలాంటి ప్రశ్నలే లోకేష్ కు ఎదురైనప్పుడు… “రాబోయే ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గాల్లో వారు బిజీగా ఉంటారు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవహారాలన్ని నేనే చూసుకోవాలి కాబట్టి.. ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగకపోవచ్చు” అని చెప్పుకొచ్చారు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ… వస్తున్నా అని చెబుతున్నారు!

ఆ సంగతులు అలా ఉంటే… రాబోయే ఎన్నికల్లో చినబాబు ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగి, ఎదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై అభిమానులు మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. అసలే లోకేషు.. పైగా పార్టీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఇదే క్రమంలో ఏపీలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరెకత వ్యక్తమవుతున్న పరిస్థితి. అలాగే… బడా బడా నాయకులు సైతం కాస్త ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాలేమో అని బయపడుతున్న పరిస్థితులు… ఈ సమస్యలన్నింటి నడుమ లోకేష్ ఎమ్మెల్యెగా పోటీ చేస్తానని ప్రకటించడంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందట.

తన రాజకీయ ప్రసంగాలకు, విమర్శలకు లోకేష్ ఎంచుకున్న వేదిక “సోషల్ మీడియా”! బయట మైకుల ముందు మాట్లాడటం వల్ల జరిగిన నష్టం చాలు, తెచ్చుకున్న “ముద్దు పేరు” చాలు అని నిర్ణయించుకున్న అనంతరం.. ఎంత పెద్ద విషయం అయినా, ఎంత చిన్న విషయం అయినా.. లోకేష్ ట్విట్టర్ వేదికగానే స్పందిస్తుంటారు. ఈ క్రమంలో… సోషల్ మీడియాలో లోకేష్ చేసే ప్రతీ ట్వీట్ కు కింద కామెంట్స్ లో… ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని గెలిచి మాట్లాడితె బాగుంటుంది అని ప్రత్యక్షమవుతుంటాయి. ఈ క్రమంలో వారి బాద తట్టుకోలేక ఈ నిర్ణయానికొచ్చారో లేక.. ఒకసారి ఆ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుందామని అనుకున్నారో.. అదీగాక, గెలిచినా ఓడినా కూడా తనకు ఎమంలెసీనో, రాజ్యసభో వస్తుందిలే అనే నమ్మకమో కానీ… ఈ సారి ఈ ఖటిన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు లోకేష్. దీంతో… ఎందుకొచ్చిన రిస్క్ చినబాబు అని చెబుతున్నారట అభిమానులు.

వారికున్న మరో టెన్షన్ ఏమిటంటే… సీఎం కుమారుడి హోదాలో రంగంలోకి దిగితే… కచ్చితంగా గెలవాలి.. ఆ గెలుపు కూడా భారీ స్థాయి మెజారిటీతో ఉండాలి. అలా కానిపక్షంలో… ఉన్న కాస్త పరువు కూడా పోతుంది. అలా కాకుండా ఏకంగా ఓడిపోయారనుకోండి… ఇంక చెప్పే పనే లేదు!! ఇది ఫ్యాన్స్ టెన్షన్!!