Home రాజకీయాలు బాధ్యత గుర్తు చేస్తూ కొట్టిన జగన్!

బాధ్యత గుర్తు చేస్తూ కొట్టిన జగన్!

SHARE

మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి.. మధ్య మద్యలో మరో సారి… తాను 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అని చెప్పుకుంటుంటారు చంద్రబాబు. మీ అనుభవం వల్ల రాష్ట్రనికి ఏమి ఒరిగిందయ్యా… అని అడిగిన వారికి మాత్రం హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ బిల్డింగ్ చూపించేవారు.. ఇప్పుడేమో అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తి కదా అని పాలన అప్పగిస్తే.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా గాలికి వదిలేశారో.. మేనిపెస్టోలో పెట్టీన విషయాలపై ప్రశ్నించిన వారిపై కూడా ఎందుకు చిందులు తొక్కుతున్నారో వారికే తెలియాలి. ఈ క్రమంలో… చేతకానప్పుడు ఎందుకు హామీలిచ్చావయ్యా అంటూ బాబును ఫుల్ గా వాయించేశారు వైకాపా అధినేత జగన్!

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కాదు. సుమారు 600 హామీలను మేనిపెస్టోలో రాయించి, జనాల్లోకి వదిలారు బాబు. అవి సాధ్యమా, అసాధ్యమా అన్న ఆలోచన ఏమాత్రం చంద్రబాబు చేసినట్లు లేదు. ఎందుకంటే.. ఆయనను ప్రశ్నించేవారు ఉండరని.. ప్రశ్నించిన వారిపై చిందులు వెయ్యొచ్చని. కానీ… ప్రశ్నించే వ్యక్తి, అవసరమైతే కడిగి పారేసే వ్యక్తి జగన్ ఉన్నాడన్న విషయం మరిచిన బాబుకు.. మేనిపెస్టోలో పేజీ నెంబర్లతో సహా చెప్పి.. మేల్కొలిపే పనికి పూనుకున్నారు జగన్.

ఈ క్రమంలో మొన్నామధ్య కాలంలో తమ సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మాటను ఏం చేశారంటూ దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మణులు చంద్రబాబును నిలదీయడానికి వచ్చిన సందర్భంగా ఆయన వారిపై అంతెత్తున ఎగిరిపడ్డారు. అసలు వారు చెబుతున్న విషయాన్ని వినేందుకు కూడా చంద్రబాబు ససేమిరా అన్నారు. తననే ఆపేస్తారా? అంటూ చిందులు తొక్కారు. చంద్రబాబు ఆగ్రహం చూసిన నాయీ బ్రాహ్మణులు షాక్ తిని.. సైలెంట్ గా ఉండిపోయారు! దీంతో రంగంలోకి దిగిన జగన్… నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు చిందులేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబుకు గట్టి కౌంటరే ఇచ్చారు. ఆలయాల్లో క్షురకులుగా పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నో పేజీలో ఉందో కూడా జగన్ చాలా విస్పష్టంగానే చెప్పేశారు. చేత కానప్పుడు ఆ హామీ ఎందుకు ఇచ్చారు? ప్రజలను మాయచేయడానికా? అసలు మీ మేనిఫెస్టో కనీసం మీకైనా గుర్తు ఉందా? అంటూ చంద్రబాబును ఏకిపారేశారు.

ఏది ఏమైనా… 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి, 40ఏళ్ల జగన్ మేనిపెస్టో గురించి చెబుతూ, గుర్తు చేయడం నిజంగా ఆశ్చర్యమే! బాబు సీనియారిటీ చెప్పుకోవడానికే తప్ప.. మరెందుకూ ఉపయోగపడదని దీంతో మరోసారి రుజువైందని అంటున్నారు విశ్లేషకులు. మేనిపెస్టో అనేది పాలకులకు దైవ గ్రంథం వంటిదని భావించిన జగన్… నెరవేర్చ గలిగినప్పుడే హామీలు ఇవ్వాలి తప్ప.. సాధ్యాసాధ్యాలు మరిచి హామీలు ఇచ్చి, జనాలకు ఆశలు కల్పించి, తర్వాత చేతులు ఎత్తేయడాన్ని.. మోసం, చేతకాని తనం అంటారని జగన్ గుర్తుచేసినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!