Home రాజకీయాలు కాస్కోండి….నేనొచ్చేస్తున్నా: లోకేష్

కాస్కోండి….నేనొచ్చేస్తున్నా: లోకేష్

1070
SHARE

గెట్ రెడీ…నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అంటున్నారు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్. మీడియాతో చిట్ చాట్‌ చేసిన ఏపీ ఐటీ శాఖామాత్యులు…. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. అయితే ఎక్కడినించో అన్నది మన ఊహాగానాలకు వదిలేశారు.
అయితే పార్టీ అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమన్తి అక్కడినీని౦చి పోటీ చేస్తానని తెలిపారు. ఇంకా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమ౦టూ చెప్పారు.

ఇక ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారం ఇచ్చారు..సో ముందే ఎన్నికలకు ఎందుకు వెళ్లాలి అని అడిగారు లోకేష్.

ఇక తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆధారాలతో రుజువు చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ఐటీ రంగంలో 2లక్షల ఉద్యోగాల ప్రామిస్కు కట్టుబడి ఉన్నామని.. వచ్చే కేబినెట్‌ సెషన్లో నిరుద్యోగ భృతిపై తుది రూపం ఇస్తామని తెలిపారు.

సైబర్ చట్టం గురించి కూడా లోకేష్ చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.