Home రాజకీయాలు బాబు అతి మాటలు.. రిపోర్ట్ లో లేవు!

బాబు అతి మాటలు.. రిపోర్ట్ లో లేవు!

283
SHARE

“గత నాలుగేళ్లలో రాష్ట్రం ఎంతో ముందుకు సాగిపోతుంది. అభివ్ర్ద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. జాతీయ జీడీపీ కంటే ఏపీ రాష్ట్ర జీడీపీనే ఎక్కువగా ఉంది. నా రాజకీయ జీవితంలో ఈ నాలుగేళ్లే అత్యంత సంతృప్తి కరమైన పిరియడ్. తమకు మరోమారు అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం. దేశం మొత్తం చూసేలా రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది” ఇవి గత కొంతకాలంగా బాబు జనాలకు చెబుతున్న మాటలు. అవినీతిలో ఏపీ ముందుంది అని రిపోర్ట్స్ వస్తున్నా కూడా బాబు చెబుతున్న మాటలు మాత్రం అలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదాయ వృద్ధి రేటు విషయంలో కాగ్‌ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) చేసిన ప్రకటన.. ఏపీ పరిస్థిత్ని చెప్పకనే చెబుతుంది. బాబు మాటలు కేవలం మాటలే అని.. పరిస్థితి దానికి ఊహించనంత దూరంలో ఉందని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే… దేశంలోనే తొలిస్థానంలో ఉందని ఆదాయ వృద్ధి రేటు విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో ఉందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2014 జూన్‌ నుంచి 2018 మే వరకు దేశంలోని ఆయా రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్లను కాగ్‌ తాజాగా వెల్లడించిన రిపోర్ట్ లో ఈ విషయాలు తెలిసాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆదాయ వృద్ధి రేట్ల వివరాలను వెల్లడించిన కాగ్… ఆయా రాష్ట్రాలకు సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ప్రతి ఏడాది నమోదైన ఆదాయ వృద్ధిని వెబ్‌ సైట్‌ లో పొందుపరిచింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే… గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం17.2 శాతం వృద్ధి రేటు సాధించి దేశంలోనే తొలి స్థానంలో నిలిచినట్టు కాగ్‌ ప్రకటించింది. ఇక మిగిలిన స్థానాల్లో 14.2 శాతంతో హర్యానా రెండో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర మూడు, ఒడిశా నాలుగో స్థానంలో, పశ్చిమబెంగాల్ ఐదో స్థానంలో నిలిచినట్టు తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాలు మాత్రమే 10 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదు చేశాయని పేర్కొంది.

దేశంలోని ఇక మిగతా రాష్ట్రాల్లో వృద్ధిరేటు తక్కువగా నమోదైనట్టు కాగ్‌ తెలిపింది. అంటే ఆంధ్ర ప్రదేశ్ వృద్ది రేటు కూడా ఆ తక్కువ వృద్ది రేటు ఉన్న రాష్ట్రాల్లో ఉందన్న మాట. ఈ క్రమంలో నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని, దానికి కారణం క్రమశిక్షణతో కూడిన పాలన అని కేసీఆర్ చెప్పుకుంటుంటే… కేంద్రప్రభుత్వం మోసం చేసింది, నోట్ల రద్దు ఎఫెక్ట్ పడింది, జీఎస్టీ వేస్టు అంటూ కుంటి సాకులు చెప్పుకుని కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇకపై సభల్లోనూ, సమావేశాల్లోనూ… రాష్ట్రం ముందుకు పోతుంది, దూసుకుపోతుంది, దేశం మొత్తం అభివృద్ధిలో రాష్ట్రం వైపే చూస్తుంది వంటి కల్లబొల్లి కబుర్లు బాబు పలకరని ఆశిద్దాం!