Home సినిమా శుభమాని పెళ్లిచేసుకుంటుంటే చంపుతామని బెదిరింపులా?

శుభమాని పెళ్లిచేసుకుంటుంటే చంపుతామని బెదిరింపులా?

387
SHARE

నటి రేణూ దేశాయ్ ట్విటర్ కి గుడ్ బై చెప్పారు. ఈ విషయ౦ ఆమె నే స్వయంగా ట్విటర్ లో్ ప్రకటించారు. ‘ట్విటర్‌ నిండా విపరీతమైన ‘నెగటివిటీ’ ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వ్యక్తులు అధికంగా అజ్ఞాత వాసులు. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా చిరాకు కూడిన వాళ్లు. ఒక సినిమా గురించి కానీ రాజకీయ వ్యక్తుల గురించి కానీ నెగెటివ్‌గా రాయడానికే ఇష్టపడతారు. ఇప్పుడు నేను నూతన జీవితం ప్రారంభిస్తున్నాను. ఈ సమయంలో ఓ నిర్ణయానికి వచ్చాను. నేనే నా ట్విటర్‌ నుంచి వైదొలగి ఈ నెగెటివిటికి దూరంగా ఉండదలుచుకుంటున్నాను. అలానే నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని నాకు అన్ని పరిస్థితులలో తోడుగా వెంట ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.

పవర్ స్టార్ అబిమానులు రేణు కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ ఆమెని చంపుతామని బెదిరిస్తున్న నేపద్యంలోనే ఆమె ఈ అబిప్రాయానికి వచ్చారని అంతా భావిస్తున్నారు.

అదేం దుర్మార్గపు ఆలోచనో….పవన్ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు…..రేణు మాత్రం డివోర్స్ తీసుకున్న భర్త జ్ఞాపకాలతో ఒంటరిగా గడపాలా…ఎంత నీచమైన మానసిక స్థితి కదా? ఇంతలా పెట్రేగి పోతున్నా పవన్ ఎందుకనో తన ఫాన్స్ని ఎప్పుడూ ఓ మాట అని ఎరగడు. తప్పు చేస్తున్న ఫాన్స్ ని వారించటానికి పవన్కి ఏ౦ కావాలి..? ఏ౦ ఆపుతుంది పవన్ ని?