Home రాజకీయాలు “చంద్రబాబు కి మెంటల్…బాబు లో అపరిచితుడు…!!”

“చంద్రబాబు కి మెంటల్…బాబు లో అపరిచితుడు…!!”

273
SHARE

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై భాజపా రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. బాబు మానసిక రోగంతో బాదపడుతున్నారని దానివల్ల రాష్ట్రానికే ప్రమాదమని కన్నా అన్నారు. నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసిందన్న బాబు సడన్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే న్యాయం చేసింద అనటం ఏమిటని…ఇది మతి భ్రమించి మాట్లాడటం కాదా అన్నారు.

కన్నా బాబులో ఒక అపరిచితుడిని చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పోలవరం ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది బీజేపీ అని గుర్తు చేస్తూ ప్రదాని మోదీ ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపి ఉండక పోతే పోలవరం కలగానే ఉండిపోయేదన్నారు.

పోలవరం నిర్మాణ అంచనాలు ఎప్పటికప్పుడు ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసిందని ఆయన ఆరోపించారు. పోలవర౦ నిర్మాణానికి పెండింగ్ బిల్లు బకాయిలు లేవని కూడా కన్నాతెలిపారు. సమాచార హక్కు చట్టం (ఆర్ టీ ఐ) ద్వారా వివరాలు అడిగిన తమకి పోలవరం ప్రాజెక్టుకు బకాయిల౦టూ ఏమీ లేవని అధికారులు చెప్పినట్టు కన్నా గుర్తు చేశారు. రూ.1950 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని కన్నా పేర్కొన్నారు.