Home రాజకీయాలు అదే నోటితో వైఎస్సార్ పేరు కూడా చెప్పు బాబు!

అదే నోటితో వైఎస్సార్ పేరు కూడా చెప్పు బాబు!

410
SHARE

చంద్రబాబు మనసు పెట్టాలే కానీ… రెండు కాదు నాలుగు నాలుకలతో మాట్లాడగలరు! ఈ విషయాలు తెలుగు ప్రజలకు కొత్త కాకపోయినా.. తాజాగా ఆయన నోటి నుంచి జాలువారిన మాటలు మాత్రం ఆ విషయాన్ని మరోమారు గుర్తుచేస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ పోలవరం తన డ్రీం, డ్రీం ప్రాజెక్టు.. ఇది బీజేపీ – టీడీపీ కూటమి వల్లే సాధ్యమవుతుంది. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చిన బాబు… అసలు పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని చెప్పుకొస్తున్నారు. సరే అంతవరకూ బాగానే ఉందని అనుకున్నా… అతీగతీ లేని పరిస్థితుల్లో పోలవరానికి పునాది వేసి దాని అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత వైఎస్సార్ పేరు మాత్రం బాబుకు గుర్తు రాకపోవడం దౌర్భాగ్యమనే అనుకోవాలి!! ఎందుకంటే… పోలవరం అనే మాట చెప్పుకున్నప్పుడల్లా.. ప్రజల మనసుల్లో మెదిలేది వైఎస్సార్ పేరు!

విషయానికొస్తే… రెండు రోజులుగా పోలవరం ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకు తిరుగుతున్నారు బీజేపీ నేతలు. పోలవరానికి సరిపడా నిధులు అన్నీ కేంద్రం ఇచ్చేసిందని, కానీ వాటిని వేరే పనులకు వాడటంతో పాటుగా.. అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఉలిక్కిపడిన చంద్రబాబు… పోలవరానికి బీజేపీకి ఏమీ సంబందం లేదని తెగేసి చెప్పే కార్యక్రమానికి తెరలేపారు. పోలవరం ప్రాజెక్టును తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారని.. కానీ దాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనని.. 90 శాతం డబ్బులిస్తామని విభజన చట్టంలో పెట్టింది కూడా ఆ పార్టీయే అని పేర్కొన్నారు.

ఏడు ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను ప్రమాణం స్వీకారం చేయనని చెబితే.. ఆ మేరకు మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకుందది తప్ప… 2013లో వచ్చిన ఆర్‌ అండ్‌ ఆర్‌ చట్టం ప్రకారం డబ్బులిస్తామని చెప్పింది మాత్రం కాంగ్రెస్‌ పార్టీనే అని బాబు పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను (తాను అడకుండానే) నీతి ఆయోగ్‌ చెబితే రాష్ట్రానికి అప్పగించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ చేసిందేమీ లేదని తేల్చి చెబుతున్న బాబు… అందుకే కేంద్రంపై పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు.

సరే… ఆ సంగతులు అలా ఉంటే.. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన పార్టీలు గుర్తున్నాయి కానీ… ఆ ప్రాజెక్టును సజీవంగా ఉంచిన వ్యక్తి బాబుకు గుర్తురాకపోవడమేమిటో? బాబు గారే చెప్పాలి. ఎవరు అవునన్నా కాదన్నా నేడు పోలవరం ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. పోలవరం కోసం అలుపెరగనిపోరాటం చేసిన వ్యక్తి వైఎస్సార్. ఈ విషయాలు కూడా బాబు గమనించి.. అనంతరం కాంగ్రెస్ ను పొగిడితే పర్లేదు కానీ.. అసలు వ్యక్తిని విశ్మరించి కొసరు మాటలు మాట్లాడటం మాత్రం నైతికత కాదు అనేది పలువురి మాట. పైగా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పై బాబుకు కొత్త ప్రేమ పుట్టుకు రావడానికి కారణాలు ప్రజలకు ఎరుకే అనేది విశ్లేషకుల మాట!!