Home రాజకీయాలు కడప స్టీల్ …కాదు ఏపీ స్టీల్స్ కర్మాగారం మేము ఏర్పాటుచేస్తాం!

కడప స్టీల్ …కాదు ఏపీ స్టీల్స్ కర్మాగారం మేము ఏర్పాటుచేస్తాం!

117
SHARE

కేంద్రం కాని, రాష్ట్రం కాని కడప ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు చేయని పక్షం లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుందని మాజీ ఎమ్.పి వైఎస్ అవినాశ్ రెడ్డి తెలిపారు.

అవినాష్ రెడ్డి ఈ విషయం వై ఎస్ జగన్ స్వయంగా చెప్పారని అన్నారు. కేంద్రం,రాష్ట్రం రెండూ కలిసి నాటకాలు ఆడుతున్నాయని అన్న అవినాష్ రెడ్డి త్వరలో జరగబోయే ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ మెజారిటీ తో గెలిచి అదికారంలోకి వస్తుందని అన్నారు.

అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వపరంగా ఎపి స్టీల్స్ పేరుతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారని అవినాష్ తెలిపారు. ప్రభుత్వపరంగా ఇబ్బంది ఉంటే ప్రైవేటు, ప్రభుత్వం కలిసి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.

మరో వైపు కడప జిల్లాలో ఉక్కు ప్యాక్టరీ రాకుండా అడ్డుకున్నదే తెలుగుదేశం పార్టీ వారని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఓ పక్క ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంటూ వారే దీక్షలకు దిగటం ఎంత ఘోరం అని ఆయన ఎద్దేవ చేశారు. జిందాల్‌ కంపెనీ అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు అందులో వారికి వాటాలొచ్చే నిబంధనలు లేవనే భావనతో ఫ్యాక్టరీనే రాకుండా అడ్డుపడ్డారని పవన్‌ ఆరోపించారు.

తనకున్న సమాచారం మేరకు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని జిందాల్‌ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. అయితే టీడీపీకి చెందిన వ్యక్తులకు లాభం కలిగే పరిస్థితులు లేనప్పుడు ఫ్యాక్టరీ కి అనుమతులు నిరాకరించడం.. లేదూ వాళ్లకు లాభంగా ఉంటుందని అనుకున్నప్పుడు ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వటం లాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయని పవన్ అన్నారు.