Home రాజకీయాలు ఎంత పబ్లిసిటీ యావ ఉంటే ఇలాంటి సన్మానాలూ…???

ఎంత పబ్లిసిటీ యావ ఉంటే ఇలాంటి సన్మానాలూ…???

SHARE

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సన్మానం తలపెట్టాలని ఉద్యోగ సంఘాలు భావిస్తే ప్రభుత్వం ఖర్చుతో జనాన్ని రప్పించటమా? నిజమే ….ఎపిలో దీనికి సంబందించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇస్తున్నారు.

ఈ మధ్య విఆర్ఎ ల జీతాలు పెంచినందుకుగాను ఉద్యోగ సంఘాలు బాబుకు సన్మానాలు చేయాలని ప్రభుత్వ వర్గాలు ఆదేశించినట్టున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు రెడీ అవుతున్నారు. వారి సొమ్ము ఎం పోయి౦ది…నయా పైసా ఖర్చు వారికి లేదు. సర్వం ప్రభుత్వమే చూసుకుంటుంది కదా. ఈ కార్యక్రమానికి ప్రతి జిల్లా నుంచి 1,500 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులను తరలించే బాధ్యత ఏ పీ ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. కలెక్టర్లు ఆర్డీవోలు, తహసీల్దార్‌లకు ఉత్తర్వులు జారీ చేశారట.

మండలాల నుంచి వీఆర్ఏలను విజయవాడలో జరిగే సీఎం సన్మానసభకు తరలించేందుకు ఓ కోకొల్లలుగా బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కోకరికి తిండి ఖర్చులకు రూ.300 చొప్పన ఇవ్వాలని కలెక్టర్లు తహసీల్దార్‌లను ఆదేశించారు.

వారుఇకి బస ఏర్పాటు, సన్మాన౦ అనంతరం వారికి రాత్రి భోజన సదుపాయం కల్పించే బాధ్యత కృష్ణా జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. ఎంత పబ్లిసిటీ యావ ఉంటే ఇంత ఖర్చూ ఇలాంటి సన్మానాలూ…???