Home రాజకీయాలు “ఉక్కు” బండారం బయటపెట్టిన పవన్!

“ఉక్కు” బండారం బయటపెట్టిన పవన్!

SHARE

కడప ఉక్కు పరిశ్రమ విషయంలో నాలుగేళ్లపాటు ఏమాత్రం పట్టించుకోని టీడీపీ నేతలు నేడు దీక్ష చేస్తున్నారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ తాను కడతానని, లేదంటే బ్రాహ్మణి స్టీల్ కోసం తాను వెచ్చించిన తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని గాలి జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి గట్టి షాకిచ్చారు. ఇపుడు ఉక్కు పరిశ్రమ కోసం హడావుడి చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. తమకి లబ్ది చేకూరదనే ఉద్దేశంతో దాన్ని అడ్డుకున్న నేతలు, ఇపుడు లబ్ది చేకూరితే పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమే అంటున్నారని పవన్ ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీలో హాట్ హాట్ గా సాగుతున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి అధికార తెలుగుదేశం పార్టీ మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. నాలుగేళ్ల పాటు చడీచప్పుడు లేకుండా ఉండి ఇప్పుడు ఆందోళన చేయడం ఏంటని ప్రజల నుంచి సహజంగానే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇలా హాట్ హాట్ గా సాగుతున్న పరిణామాల నేపథ్యంలో స్పందించిన పవన్… లండన్‌లో తాను పర్యటించినప్పుడు అక్కడి పారిశ్రామికవేత్తలు తమ ఆవేదనను చెప్పారని మొదలుపెట్టి… వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎంత వాటాలు, పర్సంటేజీలు ఇస్తారని అడిగే స్థాయికి మీ ప్రభుత్వాలు పడిపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తోందని, అందుకే తాము రావడం లేదని వారు తనతో చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్.

ఈ క్రమంలో మరింత వాయిస్ పెంచిన పవన్… “తమకు వాటాలు ఇవ్వాలన్న స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిన పరిస్థితి.. పర్సెంటేజీలు ఇస్తేనే పరిశ్రమల ఏర్పాటు అవుతుందని విదేశాల్లో కొందరు పారిశ్రామిక వేత్తలు నాతో చెప్పారు. అదే జరిగితే నిరుద్యోగం పెరిగి ప్రాంతీయ అసమానతలు వస్తాయి” అని పవన్ ఫైరవుతున్నారు. దీంతో… కడప ఉక్కు ఫ్యాక్టరీ పేరున జరుగుతున్న ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో కడప ఉక్కు పరిశ్రమ కోసం ఈ నెల 29న చేపట్టనున్న బంద్‌ కు జనసేన మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంటే.. మరోసారి ఆ వేదికగా పవన్.. బాబు ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై చూపిస్తున్న కపట ప్రేమపై మరింత చెలరేగి సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.