Home రాజకీయాలు జేసీకి గట్టిగా పడ్డాయంటున్నారు!

జేసీకి గట్టిగా పడ్డాయంటున్నారు!

822
SHARE

ఇప్పుడే కాదు.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి స్వపక్షంలో విపక్షం పాత్ర వహిస్తూ.. సొంతపార్టీ నేతలను కూడా ఇరుకునపెట్టేలా మాట్లాడే నేత తెలుగు రాష్ట్రాల్లో ఎవరయ్యా అంటే.. టక్కున చెప్పే పేరు జేసీ దివాకర్ రెడ్డి. తాను మాట్లాడింది కరెక్టయినా కాకపోయినా ఆ మాటకు కట్టుబడి మొండిగా ఉండే మనిషిగా జేసీకి పేరుంది. అయితే… అది గతం అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం చంద్రబాబు భజన బృందంలో కీలక పాత్రకోసం తెగ తాపత్రయపడుతున్న జేసీ.. ఆఖరికి లోకేష్ ను కూడా విపరీతంగా భజన చేయాల్సిన పరిస్థితికి దిగిపోయారనేది వారి అభిమానుల ఆవేదన. ఈ క్రమంలో తాజాగా జేసీకి చంద్రబాబు చేతిలో ఫుల్ గా కోటింగ్ అయ్యిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా కడప ఉక్కు పరిశ్రమపై దీక్ష పేరుతో రాజకీయానికి తెరలేపిన టీడీపీ నేతల సభాస్థలిలో జేసీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే లేపాయి. ఎంపీ సీఎం రమేష్ దీక్ష సందర్భంగా జేపీ మాట్లాడుతూ.. దీక్షల వల్ల ఉక్కు పరిశ్రమ రాదని తేగేసి చెప్పిన సంగతి తెలిసిందే. దీక్షలతో ఉక్కు పరిశ్రమ రాదు.. తుక్కు పరిశ్రమ రాదు అంటూ తేగేసి చెప్పారు. దాంతో దీక్ష చేస్తున్న నేతల మొఖాలు చిన్నబోయాయి. ఈ క్రమంలో ఇంతలో ఏమి జరిగిందో తెలియదు కానీ.. ఉన్న ఫలంగా అధినేత హక్కు అయిన “యూ టర్న్” తీసుకున్నారు జేసీ.

ఈ సందర్భంగా ప్లేటు ఫిరాయించిన జేసీ… ఉక్కు సమస్య ఉందని అందరికీ తెలియచెప్పడానికే రమేష్ దీక్ష చేస్తున్నారని, ఈ ప్రయత్నంలో రమేష్ సక్సెస్ అవుతారరని.. చెప్పుకొచ్చారు. ఇదే నోరు నిన్న… దీక్ష వల్ల ఉక్కూ రాదు తుక్కూ రాదన్న వ్యక్తి.. నేడు సీఎం రమేష్ సక్సెస్ అవుతారని చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలబ్బా అని తమ్ముళ్లు తెగ ఆలోచించేస్తున్నారట. ఆ సంగతులు అలా ఉంటే… తానన్న మాటకు ఇంతలోనే జేసీ కూడా యూటర్న్ తీసేసుకున్నారంటే.. ఆయనపై ఎలాంటి ప్రభావం పడి ఉంటుందో అని చెవులు గొరుక్కుంటున్నారట. ఈ లెక్కన చూసుకుంటే.. ఒక మోస్తరు గా చెబితే వినే వ్యక్తి జేసీ కాదు కాబట్టి… బాబు దగ్గర జేసీకి గట్టిగానే పడి ఉంటాయని చెప్పుకుంటున్నారట తమ్ముళ్లు!! టీడీపీలో జేసీ పరిస్థి చెప్పడానికి ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని మరికొందరు గుసగుసలాడటం కొసమెరుపు!!