Home రాజకీయాలు బాబు ముందస్తు టెన్షన్.. రీజన్ ఇదే!

బాబు ముందస్తు టెన్షన్.. రీజన్ ఇదే!

425
SHARE

ప్రస్తుతం దేశం మొత్తం మీద చూస్తే.. ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రస్తుత ఆలోచన ఎలా ఉందో తెలియదు కానీ.. కచ్చితంగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని మాత్రం జాతీయస్థాయి మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ముందస్తు ఎన్నికల ప్రస్తావన హాట్ టాపిక్‌ గా మారిందనే అనుకోవాలి. ఇటీవల ప్రధాని మోడీని కలిసిన అనంతరం కేసీఆర్ స్పందిస్తూ.. ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని కేంద్రానికి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇక టీ కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలకు తామూ సిద్ధమేనని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఏపీలో కూడా టీడీపీ నేతలు.. తామూ సిద్దమే అన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇక వైకాపా అధినేత జగన్ ఇప్పటికే జనాల్లో తిరుగూతు ఫుల్ బిజీగా ఉండి.. పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. అయితే… ఈ ముందస్తు ఎన్నికల సెంటిమెంట్ మాత్రం చంద్రబాబుని భయపెడుతుందని అంటున్నారు విశ్లేషకులు. దానికి కారణం తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాలి!

గతంలో జరిగిన ముందస్తు ఎన్నికల చరిత్రను ఒకసారి గమనిస్తే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో గతంలో మూడు సార్లు ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1983లో ఎన్టీఆర్ సమయంలో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ప్రభావాన్ని కొంతైనా తగ్గించవచ్చని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్దపడింది.. దీంతో తొలిసారి ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అయితే.. అంతా ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇక రెండోసారి 1989లో టీడీపీ ముందస్తు ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయింది. ఇదే క్రమంలో 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డారు. అయితే.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ సెంటిమెంటే బాబుకు టెన్షన్ పుట్టిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడు ముందస్తు ఎన్నికల్లోనూ అధికార పార్టీలు ఓటమి పాలయ్యాయి! ప్రస్తుత అధికార పార్టీ పదవీ కాలాలను ఒకసారి చూసుకుంటే… లెక్క ప్రకారం 2019 జూన్ 7వరకూ అధికారంలో ఉండే అర్హత టీడీపీకి ఉంది. అలా కాకుండా.. ఒకవేల మోడీ ఒత్తిడి మేరకో మరో కారణంతోనో ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే మాత్రం.. ఈలోపే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి! ఈ పరిస్థితుల్లో బాబు ఆ సాహసం చేస్తారని అనుకోలేం అంటున్నారురు విశ్లేషకులు.

కాసేపు సెంటిమెంట్ విషయం పక్కన పెట్టి వాస్తవాల్లోకి వస్తే… మోడీ అండ్ కో ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా ప్రస్తుతం ఏపీలో బాబు ముందస్తు సాహసం చేయరనేది పలువురి అభిప్రాయంగా ఉంది. దానికి కారణం… బాబుకు వ్యతిరేకంగా వీస్తున్న బలమైన పవనాలు, రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకత, ఎన్నడూ రానంతగా వస్తున్న అవినీతి ఆరోపణలు, ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన వైనం, ప్రజలను అత్యంత దారుణంగా వంచించిన పరిస్థితి, ఈ పరిస్థితుల నడుమ… పైకి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, మేం రేడీ అని ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా కూడా.. బాబు మాత్రం ముందస్తుకు జంకుతారనే అంటున్నారు విశ్లేషకులు!