Home రాజకీయాలు టీడీపీ కి పోలవరం ఓ అక్షయపాత్ర

టీడీపీ కి పోలవరం ఓ అక్షయపాత్ర

79
SHARE

‘పోలవరం’ను ఏపీ ప్రభుత్వం అక్షయపాత్రలా భావిస్తోందని భాజపా ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ జీవీఎల్ కేంద్రానికి ఇవ్వాల్సిన మర్యాద పూర్వక వెయిటేజ్ కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. వచ్చే రోజుల్లో కేంద్రం మరింత అప్రమత్తంగా ఉంటుందని పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ కొంచం అవకతవకలు వున్నా ఊరుకోబోమని హెచ్చరించారు. గుజరాత్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మోదీ ఎంత శ్రద్ధ పెట్టారో, అంతే ఉత్సాహం, శ్రద్ధ ఏపీపై కూడా పెడుతున్నారని అన్నారు.

మరో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏ సమస్యలు ఉన్నా కేంద్రానికి తెలియజేయాలని, సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని చెప్పారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ ను మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధుల తోనే కడుతున్నారని, అయినప్పటికి కనీసం ప్రాజెక్టుకు సంబంధించిన వెబ్ సైట్లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడా మోదీ ఫొటో కూడా పెట్టలేదని ఆరోపించారు. ల్యాండ్ అక్విజిషన్ వివరాలు వెబ్ సైట్ లో ఎందుకు పెట్టడ౦ లేదని ప్రశ్నించిన అయన చేసిన ఖర్చు మినహాయించి మిగిలిన మొత్తం చూపించకుండా టోటల్ కాస్ట్ ఎందుకు చూపిస్తున్నారని అడిగారు.