Home రాజకీయాలు వైకాపా ఎంపీ ల రాజీనామా….బిజెపీ కి నష్టం!

వైకాపా ఎంపీ ల రాజీనామా….బిజెపీ కి నష్టం!

116
SHARE

ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎమ్.పిలు చేసిన రాజీనామాలను దాదాపు 45 రోజుల తరువాత ఆలస్యంగా స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదించడం జరిగింది. ఏప్రిల్ 6న ఎమ్.పిలు మేకపాటి రాజమోమన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిదున్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలు రాజీనామాలు సమర్పిస్తే ఇన్నాళ్లకి ఆమోదించడం ఏమిటో అర్ధం కాదు.

గవర్నర్ సహా స్పీకర్ వ్యవస్త కూడా రాజకీయాలకు ఆలావాలంగా మారిపోయాయా అనిపించక మానదు.
రాజీనామాలను వెంటనే ఆమోదించి ఉంటే ఉప ఎన్నికలు వచ్చి ఉండేవి, ఇక ఇప్పుడొస్తాయో రావో తెలియని పరిస్తితి. అయితే రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇప్పుడైతే ఉపఎన్నికలు రావు. రాకుండా చేయటానికే బిజెపీ ఈ ఎత్హు వేసింది అని.

అదెలా అంటే ఉప ఎన్నిక లొస్తే బిజెపి కూడా పోటీచేయాలి ఆంధ్ర లొ బీజేపీ పై ప్రతి వారికి కోపం గానే వుంది ఈ పరిస్తితులలో బిజెపికి విజయావకశాలు మాట అటుంచి డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశాలే ఎక్కువ. అదే జరిగితే అది ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బ అవుతుంది. సాదారణ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి ఒక అవమానకరమైన విషయం అవుతుంది … అందుకే స్పీకర్ ఆమోదించలేదనే అబిప్రాయం ఉంది.

ఇక తెదేపా వారు వైకాపా భాజపా కుమ్మక్కు అంటూ కుళ్ళు మాటలు…!!