Home సినిమా విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ మొదలైంది!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ మొదలైంది!

128
SHARE

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందబోయే ఎఫ్ 2( ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభమైంది. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి భారీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ రోజు (శనివారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర‍్మాత అల్లు అరవింద్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

వెంకీ, వరుణ్ తేజ్ కు జోడిగా ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈ నెల 30నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌) అనే టైటిల్‌ ను ఫిక్స్ చేశారు. మ్యూజిక్‌ సెన్సేషన్ దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.