Home సినిమా ఆది సాయికుమార్ తో జతకట్టనున్న సురభి!

ఆది సాయికుమార్ తో జతకట్టనున్న సురభి!

101
SHARE

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది.

రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్‌ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆది సాయికుమార్ సరసన సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ సురభి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మొదటిసారి వీరిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. రావ్ రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నటీనటులు:
ఆది
సురభి
రావు రమేష్
రాధికా
అజయ్
మిర్చి కిరణ్
ప్రియా
రాజీవ్ కనకాల

టెక్నీషియన్స్:
కెమెరామెన్: సాంబ బీమావరపు
మ్యూజిక్: అరుణ్ చిలువేరు
ఎడిటర్: ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్: టి.రాజ్ కుమార్
ఫైట్ మాస్టర్: రియల్ సతీష్
డైలాగ్స్: సురేంద్ర కృష్ణ
ప్రజెంట్స్: డి.ఆర్.పీ. వర్మ
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు.
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు.నడికట్ల