Home రాజకీయాలు బీజేపీ-టీడీపీ లాలూచీ.. మరో రుజువు!

బీజేపీ-టీడీపీ లాలూచీ.. మరో రుజువు!

233
SHARE

టీడీపీ – బీజేపీ లు విడాకులు తీసుకుని కూడా కాపురం చేస్తున్నాయనే స్థాయి కామెంట్స్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న తరుణంలో… వీరి లాలూచీ వ్యవహారాలపై మరో రుజువు దొరికిందని చెబుతున్నారు వైకాపా నేతలు. తాజాగా ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైకాపా నేతలు.. ఢిల్లీ వేదికగా ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు నాడు చేసిన రాజినామాలను ఆమోదిస్తున్నట్టు తాజాగా లోక్‌ సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడింది. అనంతరం వైకాపా ఎంపీలు స్పందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి… తమ రాజీనామాల ఆమోదం కోసం కూడా ఆలస్యం చేశారంటే వారు ఎంత బయపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. అవిశ్వాసం పెడతామంటే ఐదు మందితో ఏం పెడతారని టీడీపీ నేతలు నవ్విన విషయాన్ని గుర్తు చేసిన మిథున్ రెడ్డి… అన్ని పార్టీలను కలిసి అవిశ్వాసం పెడితే దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్న విషయం టీడీపీ నేతలు గుర్తించాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా వైకాపా నేతల చిత్తశుద్ధిని శంకిస్తూ టీడీపీ నేతలు చేసిన కామెంట్స్ పై స్పందించిన ఆయన… టీడీపీ కామెంట్స్‌ పట్టించుకోవాల్సిన అవారం తమకు లేదని, వాళ్ల సర్టిఫికెట్‌ ఏమాత్రం అవసరం లేదని, తామంతా తమ అధినేత కోరిక మేరకు ప్రజల కోసం పని చేసేవాళ్లం అని మిథున్‌ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

ఈ సందర్భంగా వైకాపా నుంచి అనైతికంగా పార్టీ మారి సైకిలెక్కిన ఎంపీల విషయంపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనే అంశం… టీడీపీ-బీజేపీ కి మధ్య ఉన్న మిత్రత్వాన్ని మరోసారి రుజువు చేస్తుందని అభిప్రాయపడ్డారు. “పార్టీ మారిన ఎంపీలపై ఫిర్యాదు చేసినా మూడేళ్లుగా చర్యలు లేవు.. మా రాజీనామాల ఆమోద తాత్సరం టీడీపీ – బీజేపీ లాలూచీకి నిదర్శనం. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. పదవులు పోయినా ప్రత్యేక హోదా సాధన దిశగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ముందుకు సాగుతాం” అని మిథున్‌ రెడ్డి తెలిపారు.