Home రాజకీయాలు సీఎం రమేష్ దీక్ష రహస్యం మీడియానే కనిపెట్టాలి!

సీఎం రమేష్ దీక్ష రహస్యం మీడియానే కనిపెట్టాలి!

118
SHARE

టిడిపి ఎమ్.పి సిఎమ్ రమేష్ కొత్త పెళ్లికొడుకు మాదిరి నిరాహార దీక్ష వేదికపై ఛేంగు చెంగుమని
అలా ఎలా తిరుగుతున్నాడని, ఆయన దీక్షలో రహస్యమేమితో ఉందని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవ చేశారు.

తాను ఓ రెండు రోజుల పాటు కడప ఉక్కు కోసం దీక్ష చేస్తేనే ఎంతో నీరసపడ్డానని గుర్తుచేసిన ఆయన తనకి రెండో రోజు తలపోటు రావడం స్టార్ట్ అయిందని, అనారోగ్య లక్షణాలు కూడా మొదలయ్యాయయని గుర్తుచేసుకున్నారు.

అయితే సి ఎం రమేష్ దీక్ష నాలుగో రోజుకు చేరినా ఆయనలో ఇసుమంతైనా మార్పు లేకపోవటం చాలా ఆశ్చర్యం అని అలా వేదికమీద హుషారుగా ఎలా కనిపిస్తున్నారని రాచమల్లు అన్నారు. ఇందులో ఎదో మతలబు రహస్యం ఉందని అదేమిటో తెలియాలని వ్యాఖ్యానించారు.

ఈ రహస్యం ఏమిటో మీడియానే కనిపెట్టాలని ఆయన పేర్కొన్నారు. అసలు రమేష్ కు దీక్షలు చేయడానికి యోగ్యతే లేదని వైకాపా ఎం ఎల్ ఏ అన్నారు. ఇక టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి రమేష్ దీక్షతో ఉక్కురాదు..తుక్కు రాదని అనటం తెలిసిందే.