Home రాజకీయాలు కుల రాజకీయాలు.. బాబు మునగడం పక్కా!

కుల రాజకీయాలు.. బాబు మునగడం పక్కా!

SHARE

రాజకీయాలందు కుల రాజకీయాలు వేరయా అనాలో లేక.. రాజకీయాలందు చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు వేరయా అనుకోవాలో తెలియని పరిస్థితి తెలుగు ప్రజలది! రాజకీయాల్లో తనను మించిన అవకాశవాది మరొకరు ఉండరు అని నిత్యం నిరూపించుకునే ప్రయత్నంలో నిమగ్నమైపోయే చంద్రబాబు… ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకుని వదిలేస్తాడో ఊహించడం చాలా కష్టం! కులాల మధ్య చిచ్చు, కుల నాయకులను వాడుకుని వదిలేసే నైజం వంటి విషయాలు సమైక్య రాష్ట్రం నుంచి బాబు ఎలా నడుపుతున్నారో.. మరోసారి అదేపనికి ఎలా పూనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం!

సమైక్యరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాల – మాదిగల మధ్య చిచ్చుపెట్టి మందకృష్ణకు మద్దతు ఇచ్చి అనంతరం ఎస్సీ వర్గీకరణ పేరుతో వారిలో వారికే కొట్లాటలు పెట్టారు అనే ఖ్యాతిని సంపాదించుకున్నారు చంద్రబాబు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా ఉన్న సమయంలో “నేనే పెద్ద మాదిగ”ను అంటూ మందకృష్ణ అండతో తెలంగాణలో పాదయాత్ర చేసిన బాబు.. ఆంధ్రాలోకి అడుగుపెట్ట్గానే… ఆంధ్రాలో ఎక్కువగా మాలలను దువ్వేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఈ పరిస్థితి లంబాడీలు – ఆదివాసీలకు కూడా అంటుకుంది.

పోనీ.. మంద కృష్ణ మాదిగకు ఇచ్చిన మాటైనా నిలబెట్టుకున్నారా అంటే… తెలంగాణలో టీడీపీ పరిస్థితి కనుమరుగైపోవడంతో పాటే మాదిగలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఇక మంద కృష్ణమాదిగ అవసరం లేదని… మాలలు అధికంగా ఉన్న ఆంధ్రాలో ఎస్సీల మద్దతు అవసరం అని వర్గీకరణను అటకెక్కించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని మాదిగ సామాజిక వర్గం చంద్రబాబు మీద గుర్రుగా ఉంది. వచ్చే ఎన్నికల్లోవారు బాబు మీద పగ తీర్చుకోవడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో బాబు భయం ఏ రేంజ్ లో ఉందంటే… మందకృష్ణ ఆంధ్రాలో పర్యటించడానికి కూడా చంద్రబాబు ఎలాంటి అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త పడుతూనేటంత! ఇదే క్రమంలో దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అంటూ విజ్ఞత మరిచి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఎస్సీ ల మదిలో నిత్యం మెదులుతూనే ఉంటాయి అనడంలో సందేహం లేదు!

ఇక రాష్ట్ర విభజనం అనంతరం బాబు కన్ను కాపులపై పడింది. కోస్తా ప్రాంతంలో అధికంగా ఉన్న కాపులను బీసీలలో చేరుస్తానని హామీ ఇచ్చి, అందుకు పవన్ ను సాక్ష్యంగా నిలబెట్టినంత పనిచేసిన బాబు… ఎన్నికల అనంతరం దానిని నెరవేర్చకపోగా.. వారి ఆందోళనలు అణగదొక్కడం, వారి మీద కేసులు పెట్టి హింసించడం, కాపులకోసం పోరాడుతున్న ముద్రగడను తొక్కాలని చూడటం వంటి విషయాలను కాపులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో… రాబోయే ఎన్నికల్లో కాపులంతా ఏకమై.. బాబుకు తగిన శాస్తి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలా అని బీసీలంతా దగ్గరయ్యారా అంటే… కాపులను బీసీలలో చేరుస్తానన్న హామీ ఇచ్చిన నేపథ్యంలోనే బీసీలలో ఉన్న కులాల నేతలు పలువురు చంద్రబాబుకు ఇప్పటికే దూరం అయ్యారు. దీంతో రెంటికీ చెడ్డరేవటిలా మారింది బాబు పరిస్థితి!

ఇదే క్రమంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావును అవమానకరంగా బ్రాహ్మణ కార్పోరేషన్ పదవి నుండి తొలగించడంతో.. ఆ వర్గం కూడా చంద్రబాబుకు దూరం అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా తాజాగా టీటీడీ అర్చకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు నిర్దారించడం.. తనను వ్యతిరేకించి రమణ దీక్షితులు మీద తన పార్టీతో ఎదురుదాడి చేయించడం చంద్రబాబుకు నష్టం చేకూర్చడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.

ఇక కొండపై పనిచేసే నాయీ బ్రాహ్మణుల విషయంలో సైతం బాబు వ్యవహరించిన తీరుపై కూడా సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. కనీస వేతనం గురించి తనను అడగడానికి వచ్చిన వారిపై బాబు వ్యవహరించిన తీరు.. సీఎం అంటే సేవకుడు కాదు, నియంత అనే స్థాయిలో ఉందనేది వారి వాదనగా ఉంది. ఈ పరిస్థితులు అన్నీ గమనించినవారు మాత్రం… కులాల వారీగా విభజించు పాలించు అని ఎంచుకున్న సిద్దాంతంలో బాబు చేస్తున్న కుల రాజకీయాలే భవిష్యత్తులో నిండా ముంచనున్నాయని అంటున్నారు!