Home రాజకీయాలు ఇది “రాజకీయ డైలాగ్” కాదుకదా కన్నా?

ఇది “రాజకీయ డైలాగ్” కాదుకదా కన్నా?

191
SHARE

రాజకీయాల్లో విమర్శలు, సవాళ్లూ నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్ని విమర్శలకు ఏమాత్రం విలువ లేనట్లే.. మరికొన్ని సవాల్లకు సైతం పెద్దగా పట్టింపు ఉండదు. కొంతకాలం తర్వాత ఆ విషయాన్ని జనాలు, మీడియాతోపాటు ఛాలెంజ్ చేసిన వ్యక్తులు కూడా మరిచిపోతుంటారు! ఇలాంటి ఉదాహరణలు మన రాజకీయాల్లో కోకొల్లలు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ఒక చాలెంజ్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన అవినీతిని నిరూపిస్తా.. అలా చేయలేనిపక్షంలో జైలుకు వెళ్లడానికి సిద్ధం” ఈ రేంజ్ చాలంజ్ చేసింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. అధ్యక్ష పదవి చేపట్టకముందు, చేపట్టిని మొదటి రోజుల్లో కూడా చాలా శాంతంగా ఉన్నట్లు కనిపించిన కన్నా.. ఈ మధ్య కాస్త వాయిస్ పెంచుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి వచ్చినప్పటినుంచీ.. చంద్రబాబు పేరు చెబితే ఫైరవుతున్నారు కన్నా. ఈ క్రమంలో తాజాగా పై ఛాలెంజ్ చేశారు.

సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందంగా.. కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతోందని ఆరోపించిన లక్ష్మీనారాయణ… ప్రధాన మంత్రి రాష్ట్రానికి ఏమీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. విశాఖపట్నం రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు సంబంధించి విభజన చట్టంలో పరిశీలన చేయమని ఉందని, కృష్ణమరాజ పట్నం పోర్టుతో సీఎం చంద్రబాబు బేరం కుదుర్చుకుని… ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు కావాలంటున్నారని వివరించిన ఆయన… ప్రత్యేక హోదా విషయంలో 5000 కోట్ల రూపాయలు, ప్రత్యేక ప్యాకేజి 16000 కోట్ల రూపాయలు అని నాడు చంద్రబాబు ఒప్పుకున్న మాట గుర్తుచేస్తున్నారు!

ఏది ఏమైనా… కన్నా లక్ష్మీనారాయణ ఛాలెంజ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. నిజంగా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి ఈ రేంజ్ లో మాటలు మాట్లాడుతున్నారంటే… నిజంగా మాట మీద నిలబడాలనే అన్నారా లేక.. ఇది కూడా ఒక రాజకీయ ప్రసంగం గానే భావించాలా అనేదానికి కాలమే సమాధానం చెబుతుంది!