Home రాజకీయాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా.. మరో మైలురాయి!

నిర్విరామంగా నిర్విఘ్నంగా.. మరో మైలురాయి!

496
SHARE

కుర్చీ ఎక్కడమే లక్ష్యంగా ఎంచుకుని, ఎన్నికల వెళ మాయమాటలు చెప్పి ప్రజలను ఏమార్చేవాడు నాయకుడు కాదు.. క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకోవాలి.. ప్రజలకు సుపరిపాలన అందించాలంటే అన్ని సమస్యలపైనా, సాదారణ జనజీవితంలో ఉన్న సమస్యలు, సవాళ్లపైన మరింత అవగాహన పెంచుకోవాలని నిర్ణయించుకున్న వైకాపా అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందె. తండ్రినేర్పిన అడుగుజాడల్లో నడుస్తూ.. మరింత ప్రజాదరణ చూస్తున్న జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ తన పాదయాత్రలో మరో మైలురాయిని అందుకున్నారు!

మాట తప్పని మడమ తిప్పని నేతగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తోన్న జగన్.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న ఈ పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలోని, లక్కవరం ప్రాంతానికి చేరుకోవడంతో జగన్ పాదయాత్ర 2400 కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది. మొక్కవోని దీక్షతో నిరాటంకంగా కొనసాగిస్తోన్న ఈ ప్రజాసంకల్ప యాత్ర 195వ రోజు సందర్భంగా జగన్ ఈ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా లక్కవరంలో జగన్ ఓ మొక్కను నాటారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు… జననేతకు జేజేలు కొట్టి అభినందనలు తెలిపారు.

క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకొని, అధికారం చేపట్టిన అనంతరం తన తండ్రి వైఎస్ తరహాలోనే తన పాలన కూడా ఉండాలంటే.. క్షేత్ర స్థాయిలో మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రజాసంకల్ప యాత్రను చేస్తున్నారు జగన్. ఇడుపులపాయ నుంచి నవంబర్ 6వ తేది 2017 ప్రారంభమైన ఈ ప్రజాసంకల్పయాత్ర.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికి 9 జిల్లాలో విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర, పదోజిల్లాగా తూర్పుగోదావరిలో కొనసాగుతుంది.