Home రాజకీయాలు తెదేపా కి మరో లోకేష్ లా తయారైన జేసీ…!!

తెదేపా కి మరో లోకేష్ లా తయారైన జేసీ…!!

SHARE

తెదేపా కి ఓటేస్తే మీకు మీరు ఉరేసుకున్నట్టే అన్న లోకేష్ మాటలు…నా భూతొ నా భవిషయత్తు లాగా ఎల్ల కాలం గుర్తుండిపోయే మాట. ఆయనగారి మాటలు విని ఓటు వెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు ఏ పీ లో. ఇక వర్తమానాలోకొస్తే అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర రెడ్డి…ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎప్పటికీ తెలీని ఓ అనుభవజ్ఞుడైన రాజకీయ వేత్త.

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసి సరిగ్గా ౨౦౧౪ ఎన్నికల టైములో టీడీపీలో చేరిన ఈ సీనియర్ నాయకుడు తనకు నచ్చినట్లుగా మాట్లాడేస్తాడు తాజాగా ఒకింత కలకలం రేపే వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు ఇప్పటికే కలవరానికి గురౌతున్నారు.

కడప స్టీల్ ప్లాంట్ కోస౦ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన విషయం విదితమే. సీఎం రమేష్ దీక్ష వేదికపై జేసీ మాట్లాడుతూ దీక్షలు చేస్తే ఉక్కు…..తుక్కు ఏమీ రాదని అన్నారు. దివంగత పొట్టి శ్రీరాములులా అలంటి పరిస్థితికి సి ఎం రమేష్ చేరినా కూడా ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతవరకు కడప కు ఉక్కు కర్మాగారం రాదని తేల్చి చెప్పారు.

బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల చేసుకున్న ఖర్మ అంటూ, ఏ పీ కి ప్రధాని ఏమీ చేయరని విమర్శించారు. అంతటితో ఆగక చంద్రబాబూ ఏం తక్కువవాడు కాదు, నాటకాలడటం, డ్రామాలు ఆడించడం , కబుర్లు చెప్పడం, కుయుక్తులు పన్నడం అన్నీ తెలుసు అన్నారు

అందుకే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమీ చేయట్లేదు అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఓ వర్గాన్ని హత్యలు చేసిన మోడీ, అసలు ప్రధానిగా ఉండటానికి అర్హత లేదని వివాదాస్పద మైన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా సీఎం రమేష్ దీక్ష చేసినంత మాత్రాన ఉక్కు కర్మాగారం వచ్చేయదని అసలీ దీక్షలో నిజాయితీ లేదని మందులతో సాగు చేసిన తిండి తింటున్నవారిలో నిజాయితీ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.

విశాఖపట్నంలోని ఉక్కుకర్మాగారం కోసం ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారని ఆ తరహాలో కడప ఉక్కు ఉద్యమం అవసరమని జేసీ అభిప్రాయపడ్డారు.
తెదేపా పైనే జేసీ వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న తెదేపా నాయకులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి జోక్యం చేసుకొని జేసీ కామెంట్ల ను అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.